Tejasvi Surya : తేజ‌స్వీ సూర్య‌ను ప్ర‌శ్నించిన పోలీసులు

సీఎం కేజ్రీవాల్ నివాసంపై దాడి ఘ‌ట‌న కేసు

Tejasvi Surya : భార‌తీయ జ‌న‌తా పార్టీ యువ నాయ‌కుడు, ఎంపీ తేజ‌స్వి సూర్య(Tejasvi Surya) కు పోలీసులు ఝ‌ల‌క్ ఇచ్చారు. ఇటీవ‌ల ఢిల్లీలోని ముఖ్య‌మంత్రి అర‌వింద్ కేజ్రీవాల్ ఇంటిపైకి దాడికి పాల్ప‌డ్డారు బీజేపీ శ్రేణులు. దీని వెనుక తేజ‌స్వి సూర్య హ‌స్తం ఉంద‌న్న అనుమానం వ్య‌క్తం చేశారు ఆప్ నేత‌లు.

ఆ నిర‌స‌న‌ల్లో క‌నిపించిన తేజ‌స్వి సూర్య‌కు పోలీసులు రెండుసార్లు నోటీసులు జారీ చేశారు. ఈ ఘ‌ట‌న మార్చిలో చోటు చేసుకుంది. ఇందుకు గాను తేజ‌స్వి సూర్య‌ను పోలీసులు రెండు గంట‌ల‌కు పైగా ప్ర‌శ్నించారు.

ఈ సంద‌ర్భంగా అనేక మంది నిర‌స‌న‌కారులు బారికేడ్ల‌ను ఛేదించి దూసుకు వెళ్లారు. దాడికి పాల్ప‌డ్డారు. మార్చి 30న వివాదాస్ప‌ద చిత్రం ది కాశ్మీర్ ఫైల్స్ పై అర‌వింద్ కేజ్రీవాల్(Arvind Kejriwal) సీరియస్ కామెంట్స్ చేశారు.

ఇప్ప‌టి దాకా ఎనిమిదేళ్ల పాటు దేశంలో కొలువు తీరిన మోదీ ప్ర‌భుత్వం కాశ్మీర్ లో ఉన్న పండిట్ల కోసం ఏం చేశారో చెప్పాల‌ని డిమాండ్ చేశారు. ఇదే విష‌యాన్ని దేశ ప్ర‌జ‌లు కూడా తెలుసు కోవాల‌ని అనుకుంట‌న్నారంటూ పేర్కొన్నారు.

దీనికి సంబంధించి అర‌వింద్ కేజ్రీవాల్ చేసిన కామెంట్స్ ను నిర‌సిస్తూ బారికేడ్ల‌ను నెట్టి వేశార‌రు. గేట్ల వ‌ద్ద పెయింట్ విస‌రి వేశారు. సీసీ టీవీ కెమెరాను ధ్వంసం చేశారు.

ఇదిలా ఉండ‌గా జూన్ చివ‌రి వారంలో అశోకా రోడ్ లోని అధికారిక నివాసంలో పోలీసులు తేజ‌స్వి సూర్యను ప్ర‌శ్నించారు పోలీసులు. భ‌ద్రతా ఫుటేజీని సైతం చూపించిన‌ట్లు పోలీసులు తెలిపారు.

ఇదిలా ఉండ‌గా ఎన్నిక‌ల్లో ఓడించ లేక బీజేపీ త‌న శ్రేణుల‌తో కేజ్రీవాల్ ను లేకుండా చేయాల‌ని చూస్తున్నారంటూ ఢిల్లీ డిప్యూటీ సీఎం మ‌నీష్ సిసోడియా ఆరోపించారు.

Also Read : కూట‌మితోనే ప‌య‌నం విడిపోవ‌డం అబ‌ద్దం

Leave A Reply

Your Email Id will not be published!