Police Sieze : భారీగా నోట్లు..బంగారం స్వాధీనం
హైదరాబాద్ లో పోలీసుల తనిఖీ
Police Sieze : హైదరాబాద్ – తెలంగాణలో(Telangana) ఎన్నికల వేళ ఎక్కడ చూసినా నోట్ల కట్టలు భారీగా పట్టు పడుతున్నాయి. కళ్లు చెదిరేలా బంగారం, వెండి దొరుకుతోంది. కిలోల కొద్దీ దొరకడంతో విస్తు పోతున్నారు తనిఖీ అధికారులు. నవంబర్ 30న పోలింగ్ జరగనుంది. దీంతో కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు పెద్ద ఎత్తున తనిఖీలు చేపడుతున్నారు.
Police Sieze Huge Cash and Gold
ఇందులో భాగంగా మాధాపూర్ , సికింద్రాబాద్ , టీవీ9 ఆఫీసు ముందు తనిఖీలో కోట్ల కొద్దీ నోట్ల కట్టలు బయట పడ్డాయి. అంతే కాదు కేజీల లెక్కన బంగారం, వెండి ఆభరణాలు లభించాయి. ఇదిలా ఉండగా తాజాగా జరిపిన దాడుల్లో సికింద్రాబాద్ నగర పరిధిలో ఏకంగా 14 తులాల బంగారం , 5 కిలోల వెండిని సీజ్ చేశారు.
దీంతో ఎక్కడికక్కడ పోలీస్ చెక్ పోస్ట్ లు, ఆయా రహదారులపై ఉన్న టోల్ గేట్ల వద్ద విస్తృతంగా తనిఖీలు చేపడుతున్నారు. అంతే కాకుండా ప్రతి రోజూ వేలాది వాహనాలు తిరుగుతుంటాయి. అనుమానం వచ్చిన ప్రతి వాహనాన్ని చెక్ చేస్తున్నారు.
ఇప్పటికే కేంద్రం రూ. 2 వేల నోట్లను రద్దు చేసింది. బ్యాంకులలో సమర్పించేందుకు కొంత వెసులుబాటు ఇచ్చింది.
Also Read : Nagam Janardhan Reddy : జూపల్లి ఎలా గెలుస్తాడో చూస్తా