Munugodu By Poll : మునుగోడులో ఉప ఎన్నిక వేడి
ఎట్టకేలకు ఈసీ షెడ్యూల్ విడుదల
Munugodu By Poll : దేశ వ్యాప్తంగా ఆరు రాష్ట్రాల్లోని 7 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఉప ఎన్నికలు నిర్వహించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసింది. నవంబర్ 3న పోలింగ్ జరగనుంది. కేవలం మూడు రోజుల వ్యవధిలో నవంబర్ 6న ఫలితం ప్రకటించనున్నట్లు ఈసీ ప్రకటించింది.
ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి చెందిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఎమ్మెల్యేగా గెలుపొందారు. కానీ ఆయన ఉన్నట్టుండి ఆ పార్టీకి గుడ్ బై చెప్పారు. భారతీయ జనతా పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఇక్కడ కాంగ్రెస్ కు మంచి పట్టుంది. ఇద్దరు సోదరులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, రాజగోపాల్ రెడ్డిలకు మంచి బలం ఉంది.
ఇద్దరు అన్నదమ్ములు ఒకరు కాంగ్రెస్ లో ఉంటే మరొకరు బీజేపీలో ఉన్నారు. వెంకట్ రెడ్డి ఎంపీగా ఉంటే రాజగోపాల్ రెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నారు. దీంతో పార్టీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా ప్రకటించడంతో ఇక్కడ ఉప ఎన్నిక అనివార్యమైంది. కాగా మిగతా పార్టీలకు ఇది కోలుకోలేని దెబ్బ.
అన్ని పార్టీల కంటే బీజేపీ ప్రచారంలో ముందంజలో ఉంది. కాంగ్రెస్ నుంచి మహిళను ఎంపిక చేసింది. ఇక అధికార టీఆర్ఎస్ పార్టీ నుంచి ఇప్పటి వరకు అభ్యర్థిని ఎంపిక చేయలేదు. మొత్తంగా మునుగోడులో(Munugodu By Poll) త్రిముఖ పోటీ నెలకొనడం ఖాయంగా కనిపిస్తోంది. ఇదిలా ఉండగా వందల కోట్లు చేతులు మారనున్నాయని ప్రచారం జరుగుతోంది.
ఏది ఏమైనా త్వరలోనే ఉప ఎన్నిక డేట్ డిక్లేర్ కావడంతో రాజకీయ వేడి మరింత రాజుకుంది. మరి ఈ నియోజకవర్గంలో గెలిచే మొనగాడు ఎవరనేది ఒక నెల ఆగితే తేలుతుంది.
Also Read : సత్యం మార్గం సులభం కాదు – కేజ్రీవాల్