Congress Chief Poll : నేడే కాంగ్రెస్ అధ్యక్ష పదవికి పోలింగ్
మల్లికార్జున్ ఖర్గే వర్సెస్ శశి థరూర్
Congress Chief Poll : 134 ఏళ్ల సుదీర్ఘ చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీ తన తదుపరి అధ్యక్షుడిని ఎన్నుకునేందుకు సోమవారం ఓటింగ్ కు సిద్దమైంది. 24 ఏళ్ల తర్వాత గాంధీయేతర నాయకుడు చీఫ్ గా ఎన్నిక(Congress Chief Poll) కానున్నారు. అక్టోబర్ 19న తుది ఫలితం ప్రకటిస్తారు. మొత్తం దేశ వ్యాప్తంగా పార్టీకి సంబంధించి 9,000 మంది సభ్యులుగా ఉన్నారు. వీరందరికీ ఇప్పటికే గుర్తింపు కార్డులు జారీ చేశారు ఎన్నికల ప్రిసైడింగ్ ఆఫీసర్ మధుసూదన్ మిస్త్రీ.
ఇక బరిలో గాంధీకి వీర విధేయుడిగా పేరొందిన కర్ణాటకకు చెందిన రాజ్యసభ సభ్యుడు మల్లికార్జున్ ఖర్గే బరిలో ఉండగా ఆయనకు పోటీగా తిరువనంతపురం ఎంపీ శశి థరూర్ నిలిచారు.
ఇద్దరూ పోటాపోటీగా ప్రచారం చేపట్టారు. శశి థరూర్ సుడిగాలి పర్యటన చేశారు. ఆయన మొదటి నుంచి అసమ్మతి టీంలో సభ్యుడిగా కొనసాగుతున్నారు. ఇప్పటి వరకు పార్టీకి సంబంధించి సోనియా గాంధీ తాత్కాలిక చీఫ్ గా కొనసాగుతున్నారు.
తామిద్దరి మధ్య సాన్నిహిత్యం ఉందని ఇది కేవలం స్నేహ పూర్వక పోటీ అని స్పష్టం చేశారు మల్లికార్జున్ ఖర్గే. మరో వైపు పూర్తి పారదర్శకంగా ఎన్నిక చేపట్టాలని కోరారు శశి థరూర్. ఇద్దరూ గాంధీ ఫ్యామిలీకి కావాల్సిన వారు.
ఆనాటి దివంగత ప్రధాని రాజీవ్ గాంధీకి సన్నిహితుడిగా పేరొందారు థరూర్. ప్రస్తుతం ఆయన కూడా మేడం ఆశీస్సులతో బరిలో ఉన్నట్లు ప్రకటించారు.
ఉదయం 10 గంటలకు పోలింగ్ స్టార్ట్ అవుతుంది. ఇప్పటికే ఏర్పాట్లు పూర్తయ్యాయి. ప్రతినిధులకు ఆల్ ఇండయా కాంగ్రెస్ కమిటీ బార్ కోడ్ ల గుర్తింపు కార్డులు జారీ చేశారు.
రహస్య బ్యాలెట్ లో పార్టీ బాస్ ని ఎన్నుకునేందుకు ప్రతినిధులు తమ ఓటును వినియోగించుకుంటారు. ఏఐసీసీ దేశ వ్యాప్తంగా 65 పోలింగ్ బూత్ లు ఏర్పాటు చేసింది.
బ్యాలెట్ పేపర్ పై ఇద్దరు అభ్యర్థులు మల్లికార్జున్ ఖర్గే, శశి థరూర్ పేర్లు ఉంటాయని, ప్రతినిధులు తాము ఎన్నుకునే అభ్యర్థి పేరు పక్కన టిక్ (✓) గుర్తు పెట్టాలని ఇప్పటికే సూచించినట్లు కాంగ్రెస్ పార్టీ సెంట్రల్ ఎలక్షన్ అథారిటీ చైర్మన్ మధుసూదన్ మిస్త్రీ తెలిపారు. గాంధీ ఫ్యామిలీ నుంచి మొదటిసారిగా ఎవరూ పోటీలో లేక పోవడం విశేషం.
Also Read : 77,654 స్కామ్ లు 60 వేల 530 కోట్లు ఫ్రాడ్