Ponguleti Srinivas Reddy : బీఆర్ఎస్ పతనం ఖాయం
మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి
Ponguleti Srinivas Reddy : రాబోయే రోజుల్లో రాష్ట్రంలో బీఆర్ఎస్ పతనం ఖాయమన్నారు మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. ఆదివారం ఖమ్మంలో జరిగిన జన గర్జన సభలో పాల్గొన్నారు. ఏఐసీసీ మాజీ చీఫ్ రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. ఈ సందర్బంగా కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రజలను మోసం చేసిన కేసీఆర్ కు బుద్ది చెప్పాల్సిన అవసరం ఉందన్నారు. సంక్షేమ పథకాల పేరుతో బురిడీ కొట్టిస్తున్న బీఆర్ఎస్ ను దూరంగా పెట్టాలని లేక పోతే రాష్ట్రం నాశనం అవుతుందని జోష్యం చెప్పారు.
ఖమ్మం జిల్లాలో ప్రతి ఒక్కరినీ గెలిపించాలని కోరారు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి(Ponguleti Srinivas Reddy). పెద్ద ఎత్తున ఆశీర్వదించేందుకు వచ్చినందుకు పేరుపేరునా ధన్యవాదాలు తెలియ చేసుకుంటున్నానని చెప్పారు. అనంతరం సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క మాట్లాడారు. ఆయన ఆదిలాబాద్ జిల్లా నుంచి ఖమ్మం జిల్లా వరకు కొనసాగింది. 109 రోజుల పాటు ఈ యాత్ర కొనసాగింది.
ఈ సందర్బంగా తాను ప్రజల నుంచి ఎన్నో ఫిర్యాదులు వచ్చాయని తెలిపారు. తాము పవర్ లోకి వస్తే జన రంజక పాలన సాగిస్తామని చెప్పారు. రాష్ట్రాన్ని దోచుకుంటున్న బీఆర్ఎస్ ను బొంద పెట్టాలని పిలుపునిచ్చారు మల్లు భట్టి విక్రమార్క. మన ఐడీయాలజీ కేవలం దేశాన్ని కలపడం మాత్రమేనని పేర్కొన్నారు మల్లు భట్టి విక్రమార్క.
Also Read : Maharashtra Comment : అప్రజాస్వామ్యం ‘మరాఠా’ పర్వం