Ponguleti Srinivas Reddy : బీఆర్ఎస్ పతనం ఖాయం
పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి
Ponguleti Srinivas Reddy : ఖమ్మం మాజీ ఎంపీ, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి నిప్పులు చెరిగారు. భారత రాష్ట్ర సమితి పార్టీపై , రాష్ట్ర సర్కార్ పై భగ్గుమన్నారు. జన గర్జన సభకు జనం స్వచ్చంధంగా తరలి వస్తున్నా కావాలని అడ్డుకుంటున్నారని ఆరోపించారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు. సభ విజయవంతం కాకుండా ఉండేందుకు బీఆర్ఎస్ శ్రేణులు కుట్రలు పన్నుతున్నాయంటూ ఆరోపించారు. పొంగులేటి చేసిన కామెంట్స్ కలకలం రేపుతున్నాయి.
ఓ వైపు సభ ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. మరో వైపు ఏర్పాటు చేసిన పోస్టర్లు కాకా కలిగిస్తున్నాయి. జన సమీకరణ జరపకుండా అడ్డుకోవడం ఎంత వరకు సబబు అని ప్రశ్నించారు. ఇవాళ సాయంత్రం జరిగే సభకు రాహుల్ గాంధీ ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు. పలువురు నేతలు పార్టీలో చేరనున్నారు. దీంతో ఈ సభను ఎలాగైనా సరే సక్సెస్ చేయాలని, భారీగా ప్రజలను తరలించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి(Ponguleti Srinivas Reddy).
ఖమ్మం జన గర్జన సభతో భారత రాష్ట్ర సమితి పార్టీ పతనం ప్రారంభం కావడం ఖాయమని జోష్యం చెప్పారు మాజీ ఎంపీ. 1500 కు పైగా జనాన్ని తరలిస్తున్న వాహనాలను నిలిపి వేశారని, మరికొన్ని చోట్ల ఆర్టీసీ బస్సులు బుక్ చేసుకోనీయకుండా ప్రభుత్వం అడ్డుకుందని ఆరోపించారు.
Also Read : HMDA Super : హెచ్ఎండీఏ పనితీరు అద్భుతం