Ponguleti Srinivas Reddy : కేసీఆర్ పై పొంగులేటి కన్నెర్ర
మాజీ ఎంపీ షాకింగ్ కామెంట్స్
Ponguleti Srinivas Reddy : భారత రాష్ట్ర సమితి నుంచి సస్పెండ్ అయిన మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి(Ponguleti Srinivas Reddy) నిప్పులు చెరిగారు. ఆయన నేరుగా పార్టీ చీఫ్ , సీఎం కేసీఆర్ పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నమ్మించి మోసం చేశారని ఆరోపించారు. ఎవరు ప్రజల వైపు ఉన్నారో తెలుసన్నారు. తాను ఏనాడూ ఎవరినీ ఏమీ అనలేదన్నారు. తన కొడుకు పెళ్లి కోసం వచ్చిన లక్షలాది మంది జనాన్ని చూసి తట్టుకోలేక పోయారని అందుకే తనను ఇబ్బందులకు గురి చేస్తూ వచ్చారని అన్నారు.
ప్రాణం ఉన్నంత వరకు ప్రజలకు సేవ చేస్తానని చెప్పారు. తాను ఏనాడూ ఒక్క పైసా ఎవరితో తీసుకోలేదన్నారు. ప్రజాభిమానమే తనను ప్రజా సేవకుడిగా మార్చిందని చెప్పారు. తనను పార్టీ నుంచి సస్పెండ్ చేయడం అనాలోచిత చర్యగా అభివర్ణించారు. పోయే కాలం దగ్గరకు వచ్చిందని ఎద్దేవా చేశారు. తన ఎదుగుదలను అడ్డుకునేందుకు అడుగడుగునా ప్రయత్నం చేశారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి.
తాను పార్టీ పరంగా ఏ పని చెప్పినా చేశానని కానీ తనను కావాలని గత కొంత కాలం నుంచి పక్కకు పెడుతూ వచ్చారని ఆవేదన వ్యక్తం చేశారు. ఒకనాడు తనను అభినందించిన సీఎం ఇవాళ ఎలా కానివాడినయ్యానో చెప్పాలన్నారు పొంగులేటి. చిల్లర రాజకీయాలు చేసే వాళ్లకు తాను అర్థం కానన్నారు. తనను, తన కుటుంబాన్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తే ప్రజలు ఊరుకోరని హెచ్చరించారు.
Also Read : నిరుద్యోగుల కోసం పోరాడుదాం