Ponguleti Srinivas Reddy : కేసీఆర్ రెస్ట్ తీసుకుంటే బెటర్
బీఆర్ఎస్ కాదు బందిపోట్ల రాష్ట్ర సమితి
Ponguleti Srinivas Reddy : హైదరాబాద్ – మాజీ ఎంపీ, ప్రస్తుత కాంగ్రెస్ పాలేరు నియోజకవర్గ అభ్యర్థి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి షాకింగ్ కామెంట్స్ చేశారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. దమ్ముంటే తాను విసిరిన సవాల్ ను స్వీకరించాలని అన్నారు. తనకు ఎవరు పనులు ఇచ్చారో చెప్పాలన్నారు. నిరాధారమైన ఆరోపణలు చేయడం మంచి పద్దతి కాదన్నారు.
Ponguleti Srinivas Reddy Comments on KCR
తాను కావాలని పార్టీలో చేరుతానని అనలేదని అన్నారు మాజీ ఎంపీ. పార్టీని అడ్డం పెట్టుకుని దోచుకున్నది మీరు కాదా అని నిలదీశారు. ఈ విషయం రాష్ట్ర ప్రజలందరికీ తెలుసంటూ ఎద్దేవా చేశారు. ఈ సొమ్మంతా ప్రజలకు చెందినది కాదా అన్నారు. అవినీతి, అక్రమాలకు ప్రత్యక్ష సాక్ష్యం మేడిగడ్డ బ్యారేజీ కుంగి పోవడమేనని మండిపడ్డారు.
ఇంకా ఎంత కాలం సొల్లు కబుర్లు చెబుతారంటూ ఫైర్ అయ్యారు. ఓడి పోతే కేసీఆర్ విశ్రాంతి తీసుకుంటున్నామని అంటున్నారని, కానీ ఇన్నాళ్లు పాటు ఆయన ప్రజల మధ్యన లేకుండానే రెస్ట్ తీసుకున్నారంటూ నిప్పులు చెరిగారు. ఇక ఆయన వల్ల రాష్ట్రానికి ఒరిగింది ఏమీ లేదన్నారు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి(Ponguleti Srinivas Reddy). ప్రస్తుతం ఎంపీ చేసిన కామెంట్స్ కలకలం రేపుతున్నాయి.
Also Read : Minister KTR : మేం గెలుస్తం మాదే అధికారం