Ponguleti Srinivas Reddy : కాంగ్రెస్ ఖాయం కేసీఆర్ పతనం
మాజీ ఎంపీ శ్రీనివాస్ రెడ్డి ఆగ్రహం
Ponguleti Srinivas Reddy : ఖమ్మం – మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి(Ponguleti Srinivas Reddy) నిప్పులు చెరిగారు. పాలేరులో జరిగిన ఎన్నికల ప్రచారంలో భాగంగా సీఎం కేసీఆర్ తనపై చేసిన వ్యక్తిగత విమర్శలను తిప్పికొట్టారు. స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. నిరంతరం అధికార మదంతో, దొర తనంతో విర్రవీగుతున్న కేసీఆర్ కు పాలించే అర్హత లేదన్నారు మాజీ ఎంపీ.
Ponguleti Srinivas Reddy Slams KCR
ప్రత్యేకించి ప్రజాస్వామ్యం గురించి మాట్లాడే హక్కు తనకు లేదని స్పష్టం చేశారు. డబ్బు కట్టల గురించి ఆయన మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు. డబ్బు మదంతో ఎవరు మాట్లాడుతున్నారో దేశ ప్రజలందరికీ తెలుసన్నారు. దేశ వ్యాప్తంగా డబ్బులతో రాజకీయం చేయొచ్చని, ఓటర్లను కొనుగోలు చేయొచ్చని చేసి చూపించిన ఘనుడు కేసీఆర్ కాదా అని ప్రశ్నించారు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి.
రాష్ట్రంలో ప్రజలు మార్పు కోరుకుంటున్నారని, ఇందులో ఎలాంటి అనుమానం అక్కర్లేదన్నారు. పదేళ్ల కాలంలో బీఆర్ఎస్ సంక్షేమ పథకాల పేరుతో మోసం చేశారంటూ ఆరోపించారు. తనకు ఎలాంటి పనులు ఇచ్చారో చెప్పాలని సవాల్ విసిరారు. ఒకరు ఇస్తే తాను తీసుకునే స్థితిలో లేనని స్పష్టం చేశారు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత కేవలం కల్వకుంట్ల కుటుంబం మాత్రమే బాగు పడిందని , ప్రజలకు నష్టం వాటిల్లిందని ఆవేదన వ్యక్తం చేశారు మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి.
Also Read : Raghunandan Rao : ఇస్తే తీసుకోండి నన్ను గెలిపించండి