Ponguleti Tummala : ఆ ఇద్దరికీ కోరుకున్న సీట్లు..?
పాలేరులో పొంగులేటి..ఖమ్మంలో తుమ్మల
Ponguleti Tummala : తెలంగాణ – బీఆర్ఎస్ నుంచి ఇటీవలే కాంగ్రెస్ పార్టీలో చేరిన మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావులకు కోరుకున్న విధంగా సీట్లు కేటాయించనుందా పార్టీ. ఇదిలా ఉండగా ఇద్దరూ ఒకే సీటు పాలేరు కోసం పోటీ పడ్డారు. చివరకు తుమ్మల నాగేశ్వర్ రావు(Tummala Nageswara Rao) ఢిల్లీ వెళ్లారు. అక్కడ ఏఐసీసీ మాజీ చీఫ్ రాహుల్ గాంధీని కలిశారు.
Ponguleti Tummala Both Got a Seats
ఆ తర్వాత పార్టీ కోసం పని చేస్తానని, ఏ సీటు కేటాయించినా తాను పోటీ చేసేందుకు సిద్దంగా ఉన్నానని ప్రకటించారు. దీంతో ఈ రెండు సీట్లు ఎవరికి కేటాయిస్తారనే దానిపై ఇంకా కొలిక్కి రాలేదు. ఖమ్మం జిల్లాలో అటు పొంగులేటికి ఇటు తుమ్మల నాగేశ్వర్ రావుకు మంచి పట్టుంది.
ఇప్పటికే మధిర నియోజకవర్గం నుంచి భట్టి విక్రమార్కకు కేటాయించింది పార్టీ. 55 సీట్లలో 12 మంది బీసీలకు సీట్లు కేటాయించారు. విచిత్రం ఏమిటంటే కుటుంబంలో రెండు సీట్లు కేటాయించ కూడదనే దానిని పక్కన పెట్టింది పార్టీ. మల్కాజ్ గిరి, మెదక్ నియోజకవర్గాలలో మైనంపల్లి హనుమంత రావు, తనయుడుకు కేటాయించింది. ఇక ఉత్తమ్ కుమార్ రెడ్డి, భార్య పద్మావతి రెడ్డికి రెండు సీట్లు కేటాయించింది.
ములుగు సీటుకు సీతక్కకు, దుద్దిళ్ల శ్రీధర్ బాబు, జీవన్ రెడ్డికి సీట్లు కేటాయించింది పార్టీ.
Also Read : Revanth Reddy : కోడంగల్ బరిలో రేవంత్ రెడ్డి
