Ponnala Lakshmaiah : పొన్నాల కాంగ్రెస్ కు రాజీనామా

ఎన్నిక‌ల వేళ ఊహించ‌ని ప‌రిణామం

Ponnala Lakshmaiah : హైద‌రాబాద్ – కాంగ్రెస్ పార్టీ సీనియ‌ర్ నేత‌, మాజీ మంత్రి పొన్నాల ల‌క్ష్మ‌య్య సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకున్నారు. తాను పార్టీకి రాజీనామా చేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు. ఈ మేర‌కు త‌న రాజీనామా లేఖ‌ను ఏఐసీసీ చీఫ్ మ‌ల్లికార్జున్ ఖ‌ర్గేకు పంపించారు. దీంతో రాష్ట్రంలో ఒక్క‌సారిగా క‌ల‌క‌లం రేపింది పొన్నాల తీసుకున్న నిర్ణ‌యం.

Ponnala Lakshmaiah Resigned from Congress Party

ఆయ‌న‌కు అపార‌మైన అనుభ‌వం ఉంది. రాజ‌కీయ ప‌రంగా కాంగ్రెస్ పార్టీలో ముఖ్య నేత‌గా ఉన్నారు. బీసీ నేత‌గా గుర్తింపు పొందారు. అంతే కాదు ఉమ్మ‌డి ఏపీలో ఐటీ శాఖ మంత్రిగా ప‌ని చేశారు. తెలంగాణ ఏర్ప‌డిన త‌ర్వాత తెలంగాణ ప్ర‌దేశ్ కాంగ్రెస్ క‌మిటీకి అధ్య‌క్షుడిగా ఉన్నారు.

ప్ర‌స్తుతం తెలంగాణ‌లో శాస‌న స‌భ ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. ఈ త‌రుణంలో పార్టీకి గుడ్ బాయ్ చెప్ప‌డం ఒకింత ఆశ్చ‌ర్యానికి లోను చేస్తోంది. పార్టీలో ప‌రిస్థితి బాగో లేద‌న్నారు పొన్నాల ల‌క్ష్మ‌య్య‌(Ponnala Lakshmaiah). టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డితో క‌ల‌వాల‌ని చేసిన ప్ర‌య‌త్నం ఫ‌లించ లేద‌ని వాపోయారు. అంతే కాదు పార్టీలో బీసీల‌కు స్థానం లేకుండా పోయింద‌ని ఆవేద‌న చెందారు.

ప్ర‌స్తుతం ఆయ‌న జ‌న‌గాం టికెట్ ఆశిస్తున్నారు. తాజాగా ఆయ‌న‌కు టికెట్ వ‌చ్చే ఛాన్స్ లేద‌ని తేల‌డంతో ఇక త‌ప్పుకోవ‌డ‌మే మిగిలింద‌ని భావించారు. అందుకే గౌర‌వ ప్ర‌దంగా పార్టీ నుంచి వెళ్లి పోతున్న‌ట్లు స్ప‌ష్టం చేశారు. త్వ‌ర‌లో గులాబీ కండువా క‌ప్పుకోనున్న‌ట్లు టాక్.

Also Read : Bandla Ganesh : జ‌గ‌న్ కామెంట్స్ బండ్ల సీరియ‌స్

Leave A Reply

Your Email Id will not be published!