Ponnala Lakshmaiah : రాహుల్ పై పొన్నాల కన్నెర్ర
బీసీలను పట్టించుకోని కాంగ్రెస్
Ponnala Lakshmaiah : హైదరాబాద్ – మాజీ మంత్రి, మాజీ టీపీసీసీ చీఫ్ , బీఆర్ఎస్ నేత పొన్నాల లక్ష్మయ్య(Ponnala Lakshmaiah) షాకింగ్ కామెంట్స్ చేశారు. ఆయన ఇటీవలే గులాబీ తీర్థం పుచ్చుకున్నారు. బీసీ నేతగా గుర్తింపు పొందారు. పలు కీలకమైన పదవులు నిర్వహించారు. తనను పట్టించు కోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తూ హస్తాన్ని వీడారు. గులాబీ గూటికి చేరారు పొన్నాల లక్ష్మయ్య.
Ponnala Lakshmaiah Slams Rahul Gandhi
తాజాగా ఆయన ఏఐసీసీ మాజీ చీఫ్, వాయనాడు ఎంపీ రాహుల్ గాంధీని ఏకి పారేశారు. ఆయనను పనిగట్టుకుని టార్గెట్ చేశారు. రాహుల్ గాంధీ ఆఫీసు నుండి బీసీ నేతలకు ఫోన్ చేయడాన్ని తప్పు పట్టారు. కేవలం ఎన్నికల సమయంలోనే బీసీలు కాంగ్రెస్ పార్టీకి గుర్తుకు వస్తారంటూ మండిపడ్డారు.
గతంలో బీసీ నేతలకు అపాయింట్మెంట్ ఇవ్వకుండా ఇబ్బందులకు గురి చేశారంటూ ఆరోపించారు. ఇవాళ తమ సామాజిక వర్గానికి చెందిన వారి ఓట్లు అవసరం అవుతాయని భావించి ఫోన్లు చేస్తున్నారంటూ ఎద్దేవా చేశారు.
కాంగ్రెస్ పార్టీలో బీసీలకు స్థానం లేదన్నారు పొన్నాల లక్ష్మయ్య. కేవలం రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వారికే ప్రయారిటీ ఉందంటూ ఆరోపించారు బీఆర్ఎస్ నేత. కాంగ్రెస్ పార్టీలో ఏళ్ల తరబడి ఉన్న వారిని పట్టించు కోలేదని ఆవేదన వ్యక్తం చేశారు.
Also Read : BRS MLA Attack Comment : ఎమ్మెల్యేలా వీధి రౌడీలా..?