Ponnam Prabhakar : ఆర్టీసీ ప్రజల ఆస్తి – పొన్నం
ఆస్తులను స్వాధీనం చేసుకుంటాం
Ponnam Prabhakar : నిజామాబాద్ జిల్లా – తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. సోమవారం ఆయన నిజామాబాద్ జిల్లాలో పర్యటించారు. ఈ సందర్బంగా ఆర్టీసీపై ఆసక్తికర వ్యాఖ్యలు చేయడం కలకలం రేపింది.
ఆర్టీసీ సంస్థ ప్రజలకు సంబంధించిన ఆస్తి అని స్పష్టం చేశారు మంత్రి పొన్నం ప్రభాకర్(Ponnam Prabhakar). త్వరలోనే ఆర్టీసికి 2 వేల కొత్త బస్సులు రానున్నాయని చెప్పారు. ఇవాళ మంత్రి మీడియాతో మాట్లాడారు. ఒకవేళ ఆర్టీసీకి సంబంధించిన స్థలాలపై కన్నేస్తే ఊరుకునే ప్రసక్తి లేదని హెచ్చరించారు.
Ponnam Prabhakar Comment
గతంలో ఆర్టీసీ పరంగా స్థలాలకు సంబంధించి ఇచ్చిన లీజులను పునః సమీక్షిస్తామని తెలిపారు. లీజుల కేటాయింపుల్లో అక్రమాలు చోటు చేసుకున్నట్లు విచారణలో తేలితే స్వాధీనం చేసుకుంటామని వార్నింగ్ ఇచ్చారు పొన్నం ప్రభాకర్.
ఆర్టీసీకి వేల కోట్ల ఆస్తులు ఉన్నాయని, ప్రస్తుతం ప్రజలకు సేవలు అందించడంలో దేశంలోనే నెంబర్ వన్ గా ఉందన్నారు. తమ సర్కార్ ఇచ్చిన ఆరు గ్యారెంటీలలో రెండింటిని అమలు చేస్తున్నామని తెలిపారు . మిగతా నాలుగు గ్యారెంటీలను అమలు చేసి తీరుతామని ప్రకటించారు మంత్రి.
Also Read : TSPSC GROUP 2 : గ్రూప్ -2 పరీక్షపై ఊసెత్తని సర్కార్