Pooja Hegde : ‘త‌ల‌ప‌తి’తో న‌టించ‌డం అదృష్టం

స్టార్ హీరో త‌ల‌ప‌తిపై పూజా కామెంట్

Pooja Hegde : నెల్స‌న్ దిలీప్ కుమార్ ద‌ర్శ‌క‌త్వంలో స్టార్ హీరో త‌లప‌తి విజ‌య్ తో క‌లిసి న‌టించింది బుట్ట‌బొమ్మ పూజా హెగ్డే(Pooja Hegde). ఈనెల 13న ప్ర‌పంచ వ్యాప్తంగా బీస్ట్ మూవీ విడుద‌ల కానుంది. ఈ మేర‌కు ఏర్పాట్లు కూడా పూర్తి చేశారు మూవీ మేక‌ర్స్.

ఇప్ప‌టికే రిలీజ్ అయిన పోస్ట‌ర్స్ , టీజ‌ర్స్ , టైల‌ర్స్ అదుర్స్ అనేలా ఉన్నాయి. ఇక ఈ మూవీని స‌న్ ఇంట‌ర్నేష‌న‌ల్ నిర్మించింది. ఈ చిత్రంపై భారీ అంచ‌నాలు ఉన్నాయి.

మ్యూజిక్ ప‌రంగా ఇప్ప‌టికే రికార్డుల‌ను తిర‌గ రాసింది. అనిరుధ్ ర‌విచంద్ర‌న్ సంగీతం అందించారు. ప్ర‌త్యేకించి ఈ బీస్ట్ మూవీకి సంబంధించి విడుద‌ల చేసిన అర‌బిక్ కుతు పాట వ‌ర‌ల్డ్ వైడ్ గా పాపుల‌ర్ సాంగ్ గా నిలిచింది.

మిలియ‌న్ల కొద్ది జ‌నం దీనిని చూస్తున్నారు. ఇంకా ఆద‌రిస్తూనే ఉన్నారు. ఈ పాట‌ను మ్యూజిక్ డైరెక్ట‌ర్ అనిరుధ్ ర‌విచంద్ర‌న్ తో పాటు భార‌తీయ టాప్ సింగ‌ర్ జొనిటా గాంధీ క‌లిసి పాడారు.

మ్యూజిక్ చార్ట్స్ లో టాప్ లో ఉంది ఈ సాంగ్. ఇదిలా ఉండ‌గా బీస్ట్ మూవీ ప్ర‌మోష‌న్స్ కంటిన్యూగా కొన‌సాగుతున్నాయి. ఇక బీస్ట్ తెలుగు హ‌క్కుల్ని నిర్మాత దిల్ రాజ్ తీసుకున్నాడు.

తాజాగా సూప‌ర్ స్టార్ ఇల‌య త‌ల‌ప‌తి తో క‌లిసి న‌టించిన జ్ఞాప‌కాల‌ను పంచుకుంది న‌టి పూజా హెగ్డే. త‌న బ‌ర్త్ డే కు స్పెష‌ల్ గా ప్రోగ్రామ్ చేసి ట్రీట్ చేశారంటూ ప్ర‌శంస‌లు(Pooja Hegde) కురిపించింది త‌ల‌ప‌తి విజ‌య్ ను.

ఆయ‌న అంత పెద్ద స్టార్ అయి ఉండి త‌న‌కు డిఫ‌రెంట్ గా గ్రీటింగ్స్ చెప్ప‌డం సంతోషం క‌లిగించింద‌ని చెప్పింది.

Also Read : ఇక నుంచి జ‌బ‌ర్ద‌స్త్ చేయ‌ను – రోజా

Leave A Reply

Your Email Id will not be published!