Nitish Kumar : బీహార్ లో జ‌నాభా స‌ర్వే స్టార్ట్ – సీఎం

కుల గ‌ణ‌న స‌రిగా చేయాల‌ని ఆదేశం

Nitish Kumar : బీహార్ లో జ‌నాభా స‌ర్వే ప్రారంభ‌మైంది. స‌క్ర‌మంగా నిర్వ‌హించాల‌ని సీఎం నితీశ్ కుమార్ ఆదేశించారు. త‌మ ప్ర‌భుత్వం ప్ర‌తి ఒక్క‌రికీ న్యాయం చేయాల‌ని సంక‌ల్పించింద‌ని చెప్పారు. బీహార్ లోని హాజీపూర్ లో సీఎం మీడియాతో మాట్లాడారు. జ‌నాభా గ‌ణ‌న అత్యంత ప్రాముఖ్య‌త క‌లిగి ఉంద‌న్నారు.

అందుకే పూర్తి పార‌ద‌ర్శ‌క‌త‌తో ఉండాల్సిన అవ‌స‌రం ఉంద‌న్నారు నితీశ్ కుమార్. ఈ విష‌యంపై ఎమ్మెల్యేలు, సంబంధిత అధికారుల‌తో కూడా మాట్లాడామ‌ని చెప్పారు. ఇంత వ‌ర‌కు ఏం జ‌రిగిందో , ఇంకా ఏం చేయాల‌నే దానిపైనే ఎక్కువ ఫోక‌స్ పెడుతున్నామ‌న్నారు. ఇదే మా ల‌క్ష్య‌మ‌ని స్ప‌ష్టం చేశారు సీఎం .

ఇప్ప‌టి వ‌ర‌కు కుల గ‌ణన విజ‌య‌వంతంగా జ‌రిగింద‌ని చెప్పారు . ఇంకా అనేక కులాలు, ఉప కులాలు ఉన్నందున జ‌నాభా గ‌ణ‌న అనేది ప్రాముఖ్య‌త క‌లిగి ఉంద‌న్నారు నితీశ్ కుమార్(Nitish Kumar). దీనిని పూర్తిగా త‌ప్పులు లేకుండా చేయాల‌న్ను. అనేక కులాలు, వాటికి ఉప కులాలు న‌డుస్తున్నాయ‌ని అన్నారు.

ఎటువంటి వ్య‌త్యాసాలు ఉండ‌కుండా చూసుకోవాల‌ని సూచించారు సీఎం. ముందు జ‌నాభా గ‌ణ‌న స‌క్ర‌మంగా జ‌రుగుతుంద‌ని తాము ముందు నిర్దారించు కోవాల్సిన అవ‌స‌రం ఉంద‌న్నారు నితీశ్ కుమార్. యాధృశ్చికంగా బీహార్ లో కుల ఆధారిత స‌ర్వే మొద‌టి ద‌శ ప్రారంభ‌మైంది. మొత్తం 38 జిల్లాల్లో రెండు ద‌శ‌ల్లో కులాల వారీగా హెడ్ కౌంట్ నిర్వ‌హించ‌నున్న‌ట్లు తెలిపారు సీఎం. ఏప్రిల్ 1 నుంచి 30 దాకా రెండో ద‌శ స‌ర్వే జ‌రుగుతుంద‌న్నారు సీఎం.

కాగా 38 జిల్లాల్లోని 2.58 కోట్ల కుటుంబాల‌లో 12.70 కోట్ల జ‌నాభాను ఈ స‌ర్వే క‌వ‌ర్ చేయ‌నుంది.

Also Read : రాహుల్ ప్ర‌శ్న‌ల‌కు జ‌వాబు చెప్పండి

Leave A Reply

Your Email Id will not be published!