Posani Krishna Murali : పురందేశ్వరిపై పోసాని ఫైర్
వైఎస్సార్ కాపాడింది మరిచి పోతే ఎలా
Posani Krishna Murali : తాడేపల్లి గూడెం – ఏపీ చలనచిత్ర అభివృద్ధి సంస్థ చైర్మన్ పోసాని కృష్ణ మురళి నిప్పులు చెరిగారు. ఆయన భారతీయ జనతా పార్టీ చీఫ్ దగ్గుబాటి పురందేశ్వరిపై మండిపడ్డారు. గతంలో ఏం జరిగిందో అప్పుడే మరిచి పోతే ఎలా అని ప్రశ్నించారు.
పోసాని కృష్ణ మురళి మీడియాతో మాట్లాడారు. నందమూరి బాలకృష్ణ బెల్లంకొండ సురేష్ వ్యవహారాన్ని గుర్తు చేశారు. ఆరోజున తన ఇంట్లో ఇద్దరిపై కాల్పులు జరిపాడని , ఆ సమయంలో దగ్గుబాటి పురందేశ్వరి వెళ్లి దివంగత సీఎం డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డిని కాళ్లా వేళ్లా పడి వేడుకుందని దీంతో మనసు మార్చుకుని కాపాడాడని అన్నారు.
Posani Krishna Murali Slams Purandeswari
ఇది మరిచి పోయి పురందేశ్వరి అవాకులు చెవాకులు పేలడం ఎంత వరకు సబబు అని ప్రశ్నించారు పోసాని కృష్ణ మురళి(Posani Krishna Murali ). ప్రజలు పురందేశ్వరిని, నారా చంద్రబాబు నాయుడిని, బాలకృష్ణను క్షమించరని స్పష్టం చేశారు.
అవినీతి, అక్రమాలకు పాల్పడిన చంద్రబాబు నాయుడును అరెస్ట్ చేయక పూల దండలు వేసి ఊరేగిస్తామా అని ప్రశ్నించారు. చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుందన్నారు. అధికారం ఉంది కదా అని అడ్డంగా దోపిడీ చేసుకుంటూ పోతే ఎలా అని నిలదీశారు.
Also Read : Vikas Raj : షెడ్యూల్ ప్రకారమే అసెంబ్లీ ఎన్నికలు