Nitish Kumar : పోస్ట‌ర్లు..హోర్డింగ్ లు ప్ర‌ధానిని చేయ‌వు

ప్ర‌తిప‌క్షాలు క‌లిసి పోరాడితే మ‌న‌దే జ‌యం

Nitish Kumar : జేడీయూ చీఫ్‌, బీహార్ సీఎం నితీశ్ కుమార్ షాకింగ్ కామెంట్స్ చేశారు. మ‌ణిపూర్ రాష్ట్రంలో జేడీయూకి చెందిన 7 మంది ఎమ్మెల్యేల‌లో 5 మంది ఎమ్మెల్యేలు బిగ్ షాక్ ఇచ్చారు.

వారంతా నితీశ్ కుమార్ కు చెప్ప‌కుండానే జంప్ అయ్యారు. కాషాయ తీర్థం పుచ్చుకున్నారు. ఈ సంద‌ర్భంగా కీల‌క కామెంట్స్ చేశారు. పోస్ట‌ర్లు..హోర్డింగ్ లు ఎవ‌రినీ ప్ర‌ధాన మంత్రిని చేయ‌వ‌ని కుండ బ‌ద్ద‌లు కొట్టారు.

ఎంత మంది ఎమ్మెల్యేల‌ను ఇలా ప్ర‌లోభాల‌కు గురి చేస్తారంటూ నితీశ్ కుమార్(Nitish Kumar)  ప్ర‌శ్నించారు. 2024లో జ‌రిగే సార్వత్రిక ఎన్నిక‌ల్లో ప్ర‌తిప‌క్షాల‌న్నీ క‌లిసిక‌ట్టుగా ఏక‌మైతే బీజేపీకి షాక్ ఇవ్వ‌డం ఖాయ‌మ‌న్నారు.

50 సీట్లు కోల్పోవ‌డం త‌ప్ప‌నిస‌రి అని పేర్కొన్నారు. ఇదిలా ఉండ‌గా బీహార్ లో గ‌త 17 సంవ‌త్స‌రాల పాటు బీజేపీతో ఉన్న అనుబంధాన్ని తెంచుకున్నారు నితీశ్ కుమార్.

ఉన్న‌ట్టుండి కోలుకోలేని షాక్ ఇచ్చారు బీజేపీకి. ప్ర‌ధానంగా పీఎం మోదీ, కేంద్ర హొం శాఖ మంత్రి అమిత్ షా వ్యూహాలు ప‌ని చేయ‌లేదు. త‌న‌ను ప‌డ‌గొట్టాల‌ని ప్ర‌య‌త్నం చేసిన ట్ర‌బుల్ షూట‌ర్ షాకు దిమ్మ తిరిగేలా చేశాడు.

ఆర్జేడీ, కాంగ్రెస్, ఇత‌ర పార్టీల‌తో క‌లిసి సంకీర్ణ ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేశాడు. 31 మందితో కేబినెట్ ను విస్త‌రించాడు. మిత్ర బంధాన్ని తెంచు కోవ‌డంతో బీజేపీ ఆప‌రేష‌న్ ఆక‌ర్ష్ స్టార్ట్ చేసింది. జార్ఖండ్ లో సీఎం ఎమ్మెల్యే శాస‌న‌స‌భ స‌భ్య‌త్వాన్ని ర‌ద్దు చేశారు.

మీడియాతో మాట్లాడారు సీఎం నితీశ్ కుమార్. బీజేపీ వ్య‌తిరేక ఫ్రంట్ కోసం ఇత‌ర పార్టీల అగ్ర‌నేత‌ల‌ను క‌లిసేందుకు ఢిల్లీలో ఉన్నారు.

Also Read : రాబోయే ఎన్నిక‌ల్లో నేనేంటో చూపిస్తా

Leave A Reply

Your Email Id will not be published!