The Kashmir Files : న్యూజిలాండ్ లో ‘ది కాశ్మీర్ ఫైల్స్’ వాయిదా
మరోసారి సమీక్షించాలన్న సెన్సార్ బోర్డు
The Kashmir Files : వివేక్ అగ్ని హోత్రి తీసిన ది కాశ్మీర్ ఫైల్స్ మూవీ భారత దేశంలో విడుదలై సంచలనం సృష్టించింది. ఎవరూ ఊహించని రీతిలో రూ. 100 కోట్లకు పైగా వసూలు సాధించి రికార్డ్ బ్రేక్ చేసింది.
ఈ చిత్రాన్ని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రమోట్ చేశారు. దేశంలోని కొన్ని రాష్ట్రాలలో ది కశ్మీర్ ఫైల్స్ (The Kashmir Files)మూవీకి వినోద పన్ను మినహాయింపు ఇచ్చాయి. ఈ మూవీ ఓవర్సీస్ లో కూడా జనాదరణ పొందుతోంది.
తాజాగా సక్సెస్ టాక్ అందుకున్న ఈ చిత్రానికి న్యూజిలాండ్ లో చుక్కెదురైంది. 1980 చివర్లో 1990 ప్రారంభంలో జమ్మూ కాశ్మీర్ లో చోటు చేసుకున్న దారుణాలు, కశ్మీర్ పండిట్లు లక్షలాదిగా వలస వెళ్లారు.
ఈ సంఘటనను ఆధారంగా చేసుకుని తెరకెక్కించే ప్రయత్నం చేశారు ఫిల్మ్ మేకర్ వివేక్ అగ్నిహోత్రి. ఈ చిత్రంలో ప్రముఖ నటీ నటులు అనుపమ్ ఖేర్ , మిథున్ చక్రవర్తి, పల్లవి జోషి నటించారు.
హాట్ హాట్ గా చర్చకు దారి తీసింది ది కశ్మీర్ ఫైల్స్ మూవీ. తాజాగా ఈ చిత్రాన్ని వాయిదా వేస్తున్నట్లు న్యూజిలాండ్ సెన్సార్ బోర్డు ప్రకటించింది.
అయితే వాయిదా వేసే కంటే ముందు అక్కడి సెన్సార్ బోర్డు కొన్ని సంఘాలు, సంస్థలు అభ్యంతరం తెలియ చేయడంతో ది కశ్మీర్ ఫైల్స్ వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది.
దేశంలోని సెన్సార్ బోర్డు ది కాశ్మీర్ ఫైల్స్(The Kashmir Files) కి 16 ఏళ్లు అంతకంటే ఎక్కువ వయసు ఉన్న వారు చూసేందుకు అనుమతి ఇచ్చింది. తన నిర్ణయాన్ని పునః సమీక్షించాలని నిర్ణయించింది. మూవీ ప్రదర్శనను తాత్కాలికంగా నిలిపి వేస్తున్నట్లు ప్రకటించింది.
Also Read : మహేష్ తో చిత్రం మల్టీస్టారర్ కాదు – రాజమౌళి