Pothina Venkata Mahesh : టీటీడీని భ్రష్టు పట్టించిన జగన్
భగ్గుమన్న జనసేన పార్టీ
Pothina Venkata Mahesh : ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి తాజాగా టీటీడీ పాలక మండలి సభ్యుల నియామకంలో అనుసరించిన వైఖరిపై సర్వత్రా నిరసన వ్యక్తం అవుతోంది. తీవ్ర అభ్యంతరాలు వెల్లడి అవుతున్నాయి. బీజేపీ రాష్ట్ర చీఫ్ దగ్గుబాటి పురందేశ్వరి టీటీడీ రాజకీయ పునరావాస కేంద్రంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు.
Pothina Venkata Mahesh Comments
తాజాగా నేర చరిత్ర కలిగిన వారిని, జైలుకు వెళ్లి వచ్చిన వారిని, లిక్కర్ స్కాం లో కీలకమైన పాత్ర పోషించిన వారికి టీటీడీ బోర్డు మెంబర్ గా చోటు కల్పించడం దారుణమని పేర్కొంది జనసేన పార్టీ. ఆదివారం ట్విట్టర్ వేదికగా సంచలన ప్రకటన చేసింది.
తిరుమల పవిత్రతకు భంగం కలిగించడం, అన్యమతస్థుడిని తీసుకు వచ్చి టీటీడీ చైర్మన్ గా నియమించడం ఎంత వరకు సబబు అని ప్రశ్నించింది. హిందువుల మనో భావాలను దెబ్బ తీయడమే లక్ష్యంగా జగన్ రెడ్డి పెట్టుకున్నాడంటూ ఆరోపించారు జనసేన పార్టీ స్పోక్స్ పర్సన్ పోతిన వెంకట మహేశ్(Pothina Venkata Mahesh). విజయవాడలో మీడియాతో మాట్లాడారు.
తన కేసుల నుండి బయట పడేందుకు ఇప్పటి దాకా అన్ని రకాలుగా యత్నించిన జగన్ రెడ్డి ఇప్పుడు టీటీడీని సైతం స్వార్థ ప్రయోజనాల కోసం వాడుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దర్యాప్తు సంస్థల ఉన్నతాధికారులను, వారి బంధువులకు టీటీడీలో చోటు కల్పిస్తామని ఆశ చూపినట్లు ఆరోపణలు ఉన్నాయని తెలిపారు.
Also Read : Harish Rao : రైలు కూత హరీశ్ కెవ్వు కేక