Bombay High Court : పీపీ ప్రోబ్ ఏజెన్సీకి పోస్టాఫీస్ కాదు
బాంబే హైకోర్టు షాకింగ్ కామెంట్స్
Bombay High Court : బాంబే హైకోర్టు షాకింగ్ కామెంట్స్ చేసింది. పబ్లిక్ ప్రాసిక్యూటర్ ప్రోబ్ ఏజెన్సీకి సంబంధించి పోస్టాఫీస్ కాదని వ్యాఖ్యానించింది.
నిర్ణీత 180 రోజుల్లోగా డ్రగ్స్ కేసులో ఛార్జి షీట్ దాఖలు చేయడంలో ప్రాసిక్యూషన్ విఫలమైందన్న కారణంతో డిఫాల్ట్ బెయిల్ కోరుతూ శ్లోక్ తండంకర్ పిటిషన్ దాఖలు చేశారు.
దీనిపై జస్టిస్ భారతి డాంగ్రే సెప్టెంబర్ 6న ఉత్తర్వులు జారీ చేశారు. ఇందుకు సంబంధించి ఇవాళ తీర్పు కాపీ అందుబాటులోకి వచ్చింది.
ఛార్జ్ షీట్ సమర్పించేందుకు సమయం పొడిగింపు కోరే ముందు స్వతంత్ర అభిప్రాయాన్ని ఏర్పర్చు కోవాలని డ్రగ్స్ కేసులో బెయిల్ మంజూరు చేస్తూ బాంబే హైకోర్టు పేర్కొంది.
ఇదిలా ఉండగా నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్ స్టాన్సెస్ (ఎన్డీపీఎస్ ) చట్టంలోని నిబంధనలను హైకోర్టు(Bombay High Court) ప్రస్తావించింది. విచారణ పురోగతిపై హైకోర్టు ప్రస్తావించింది.
విచారణ పురోగతిపై ప్రాసిక్యూటర్ నివేదికను సమర్పించి కారణాన్ని తెలియ చేస్తే ఛార్జ్ షీట్ దాఖలు చేసేందుకు కోర్టు 180 రోజుల వ్యవధిని పొడిగించవచ్చు.
ఒక వేళ గడువు దాటితే నిందితులను నిర్బంధించేందుకు వీలుంటుంది. ప్రస్తుత కేసులో పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఎప్పుడూ నివేదిక సమర్పించ లేదు.
అయితే దర్యాప్తు అధికారి నేరుగా కోర్టు ముందు దరఖాస్తుకు ప్రాధాన్యత ఇచ్చాడని జస్టిస్ డాంగ్రే స్పష్టం చేశారు. పీపీ నివేదికను సమర్పించాలని శాసనసభ ఉద్దేశ పూర్వకంగా ఆలోచించింది.
సమయం పొడిగింపు కోసం దరఖాస్తు చేసేందుకు ఉద్దేశ పూర్వకంగా దర్యాప్తు అధికారికి వదిలి వేయలేదని ఆర్డర్ లో పేర్కొంది.
Also Read : షిండే వల్లనే చిప్ ప్లాంట్ కోల్పోయాం