Prabhas : రౌడీ బాయ్స్ కు ప్ర‌భాస్ అభినంద‌న‌

14న విడుద‌ల కానున్న చిత్రం

Prabhas  : ఆశిస్ రెడ్డి, అనుప‌మ ప‌ర‌మేశ్వ‌రన్ జంట‌గా న‌టించిన రౌడీ బాయ్స్ సంక్రాంతి పండుగ‌ను పుర‌స్క‌రించుకుని ఈనెల 14న విడుద‌ల కానుంది. ప్ర‌ముఖ నిర్మాత దిల్ రాజు సోద‌రుడి తన‌యుడు ఆశిష్ రెడ్డితో ఈ తొలి చిత్రాన్ని తీశాడు.

ఫుల్ రొమాంటిక్ సీన్స్ తో హ‌ల్ చ‌ల్ చేస్తోంది ఈ మూవీ ట్రైల‌ర్. ప్ర‌ధానంగా అనుప‌మ మొద‌టిసారి లిప్ లాక్ కిస్ ఇవ్వ‌డం చ‌ర్చ‌నీయాంశంగా మారింది.

ఈ త‌రుణంలో రౌడీ బాయ్స్ కు సంబంధించిన ఓ పాట‌ను పాన్ ఇండియా న‌టుడు డార్లింగ్ ప్ర‌భాస్ విడుద‌ల చేశాడు. ఈ సంద‌ర్భంగా హీరో ఆశిష్ రెడ్డిని ప్ర‌త్యేకంగా అభినందించాడు.

యే జింద‌గీ అనే టైటిల్ తో రూపొందించిన ఈ పాట పాత్ర‌ల మ‌ధ్య బ‌లమైన బంధాన్ని , స్నేహాన్ని వ‌ర్ణిస్తుంది. వీరిద్ద‌రి మ‌ధ్య ఇదే తొలిచిత్రం కావ‌డం విశేషం.

ఈ సంద‌ర్భంగా త‌మ మూవీకి సంబంధించిన పాటను విడుద‌ల చేసిన ప్ర‌భాస్ (Prabhas )కు కృత‌జ్ఞ‌త‌లు తెలిపింది చిత్ర యూనిట్. సినిమాకు సంబంధించి మంచి సాంగ్ ను రిలీజ్ చేసినందుకు త‌నకు సంతోషంగా ఉంద‌న్నాడు డార్లింగ్ ప్ర‌భాస్.

జీవితంలో అన్నింటి కంటే స్నేహం ముఖ్య‌మ‌న్నాడు. త‌న‌కు నిర్మాత దిల్ రాజు తో 18 ఏళ్లుగా స్నేహం ఉంద‌ని ఈ సంద‌ర్భంగా చెప్పాడు ప్ర‌భాస్.

రౌడీ బాయ్స్ మూవీ ఇంజ‌నీరింగ్ , మెడిక‌ల్ కాలేజీ స్టూడెంట్స్ మ‌ధ్య గ్యాంగ్ వార్ నేప‌థ్యంలో

No comment allowed please