Pragyan Rover Vikram Lander : జాబిలిపై ల్యాండర్..రోవర్ ఫోకస్
జాబిలి పై రోవర్ పరిశోధనలు
Pragyan Rover Vikram Lander : ఇస్రో – భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ఆధ్వర్యంలో చంద్రుని పై దింపిన చంద్రయాన్ – 3 ల్యాండర్, మరియు రోవర్ లకు నిర్దేశించిన పనులను విజయవంతముగా పూర్తి చేశాయి, జాబిలి పై 14 రోజుల పగటి కాలం పూర్తి కావడం తో అక్కడ చీకటి గా మారి మైనస్ 180 డిగ్రీల చల్లటి వాతావరణం ఆవహించే తరుణం ఆసన్నం కావడం తో,ల్యాండర్ ను,ప్రజ్ఞాన్ రోవర్ ను స్లీప్ మోడ్ లోకి పంపి నిలిపి వేశారు, నిన్న రాత్రి 10 గంటల 01 నిమిషానికి ల్యాండర్,రోవర్ ను స్లీప్ మోడ్ లోకి పంపించారు.
Pragyan Rover Vikram Lander Updates
జాబిలి పై 14 రోజుల పాటు చీకటి కాలాన్ని పూర్తి చేసుకున్న తరువాత తిరిగి పగటి కాలం వచ్చే వేళలో అంటే ఈ నెల 22 వ తేదీ ఆ పై కానీ తిరిగి ల్యాండర్ ను రోవర్ ను ఆన్ చేయాలనీ ఇస్రో నిర్ణయించింది, జాబిలి పై మైనస్ 180 చల్లదనం మధ్య పద్నాలుగు రోజుల పాటు ఉండే ల్యాండర్ ,రోవర్ తిరిగి పగటి కాలం రాగానే సోలార్ ప్యానల్ ఆధారంగా అవి రెండు పని చేసేలా చేయడం ఇప్పుడు ఇస్రో ముందు ఉన్న మరో కొత్త సవాల్ అని చెప్పక తప్పదు.
సెప్టెంబర్ 22 తరువాత కూడా ల్యాండర్ , రోవర్ పని చేయడం మొదలు పెడితే చంద్రయాన్ – 3 తో ఇస్రో(ISRO) రెండవ విజయం సాధించినట్లు అవుతుంది, చంద్రుని పై దక్షణ ధ్రువం వైపున రోవర్ 100 మీటర్ల దూరం తిరిగి జరిపిన అధ్యనం లో విలువైన సమాచారాన్ని ల్యాండర్ ద్వారా భూమికి చేర్చడం జరిగింది,
జాబిలి పై సల్ఫేర్, కాల్షియం, ఇనుము, టైటానియం, సిలికాన్ , మాంగనీస్ వంటి ఖనిజ సంపద ఉన్నట్లు గుర్తించడం జరిగింది.
Also Read : Chandrababu Naidu : రేపటి నుండి చంద్రబాబు టూర్