Praja Darbar : జనం క్యూ కట్టారు పోటెత్తారు
ప్రజా దర్బార్ కు అనూహ్య స్పందన
Praja Darbar : హైదరాబాద్ – రాష్ట్రంలో కొలువు తీరిన కాంగ్రెస్ సర్కార్ దూకుడు పెంచింది. కొత్తగా సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన ఎనుముల రేవంత్ రెడ్డి స్పీడ్ పెంచారు. ఈమేరకు వస్తూనే ప్రజా దర్బార్ కు శ్రీకారం చుట్టారు. ఎవరైనా సరే తన వద్దకు రావచ్చని, తమ సమస్యలు ఉంటే విన్నవించని స్పష్టం చేశారు. సుదూర ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున ప్రజలు తరలి రావడం ప్రారంభించారు. ప్రతి వారంలో రెండు రోజుల పాటు ఈ దర్బార్ ఉంటుందని ప్రకటించారు.
Praja Darbar Viral
దీంతో రాష్ట్రంలోని నలు మూలల నుండి ప్రజా దర్బార్ కు పోటెత్తారు. ఇదిలా ఉండగా ఈనెల 8వ తేదీన మహాత్మా జ్యోతిబా పూలే ప్రజా భవన్ ను ప్రారంభించారు సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy). ఈ కార్యక్రమానికి విశేషమైన స్పందన లభిస్తోంది.
వికలాంగులకు వీల్ చైర్స్ ఏర్పాటు చేశారు. ఉచితంగా నీటిని అందిస్తున్నారు. ఇదిలా ఉండగా ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన తర్వాత నేటి దాకా ప్రజల నుండి 4,471 వినతి పత్రాలు వచ్చాయని ముఖ్యమంత్రి కార్యాలయం వెల్లడించింది.
ఇందులో ఎక్కువగా డబుల్ బెడ్ రూమ్ ల ఇళ్లు, పెన్షన్ లకు సంబంధించిన సమస్యలే ఎక్కువగా ఉన్నాయని పేర్కొంది. ఇక ఇవాళ చేపట్టిన ప్రజా వాణి కార్యక్రమంలో 1,143 వినతిపత్రాలు అందినట్లు ప్రజా భవన్ తెలిపింది.
Also Read : Chiranjeevi : కేసీఆర్ ఆరోగ్యంపై ఆరా