Prakasam Barrage : ప్రకాశం బ్యారేజ్ కు వరద ఉధృతి
కృష్ణా నదికి పోటెత్తిన వరద
Prakasam Barrage : భారీ వర్షాల తాకిడి కొనసాగుతూనే ఉంది. ఇరు తెలుగు రాష్ట్రాలను వర్షాలు ముంచెత్తాయి. వాన దెబ్బకు చిగురుటాకులా వణికాయి. కృష్ణా నది, గోదావరి నది ఉగ్ర రూపం దాల్చుతున్నాయి. ఎగువ కురుస్తున్న భారీ వర్షాలకు వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. చెరువులు, కుంటలు నీటితో నిండి పోయాయి. మునేరు , బుడమేరు, పీలేరు నుంచి కృష్ణా నదికి భారీగా వరద నీరు చేరుతోంది.
Prakasam Barrage Full of Water
దీంతో ప్రకాశం బ్యారేజ్(Prakasam Barrage) కు సంబంధించి 25 గేట్లు నాలుగు అడుగుల మేర, 45 గేట్లు మూడు అడుగుల మేర ఎత్తివేశారు అధికారులు. 1 లక్షా 61 వేల 775 క్యూసెక్కుల వరద నీటిని సముద్రంలోకి విడుదల చేశారు. ఇదిలా ఉండగా నదీ తీరం వెంట, దిగువ ప్రాంతంలో నివాసితుల్ని రెవిన్యూ సిబ్బంది ఖాళీ చేయిస్తున్నారు. ఎప్పటికప్పుడు ప్రభుత్వ కార్యదర్శి సమీక్షిస్తున్నారు.
ఏపీలో చోటు చేసుకున్న వరదలు, ముంపు బాధితులు, సహాయక చర్యలపై సీఎం జగన్ రెడ్డి తాడేపల్లి గూడెంలోని క్యాంపు కార్యాలయంలో సమీక్ష చేపట్టారు. ఏ ఒక్కరు ఇబ్బంది పడకుండా చూడాలని ఆదేశించారు. రాష్ట్రంలోని జిల్లాల కలెక్టర్లతో వీడియో సమావేశం ద్వారా మాట్లాడారు. స్పెషల్ ఆఫీసర్లు ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని స్పష్టం చేశారు ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి.
Also Read : CM KCR Missing : కేసీఆర్ మిస్సింగ్ పోస్టర్ వైరల్