Prakash Javadekar : సీఎం కేసీఆర్ రాజీనామా చేయాలి
బీజేపీ ఎంపీ ప్రకాశ్ జవదేకర్
Prakash Javadekar : న్యూఢిల్లీ – బీజేపీ ఎంపీ, తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ ప్రకాశ్ జవదేకర్ షాకింగ్ కామెంట్స్ చేశారు. లక్షా 20 వేల కోట్ల ప్రజా ధనంతో కట్టిన కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి , అక్రమాలు చోటు చేసుకున్నాయని ఆరోపించారు. బుధవారం ఆయన ట్విట్టర్ వేదికగా స్పందించారు.
Prakash Javadekar Shocking Comments on KCR
ప్రపంచంలో ఇలాంటి ప్రాజెక్టు ఎక్కడా లేదని నిన్నటి దాకా బీరాలు పలికిన కేసీఆర్ ఇప్పుడు ఏం చేస్తున్నారంటూ ప్రశ్నించారు. కోట్లాది రూపాయలను నీళ్లపాలు చేశారంటూ మండిపడ్డారు జవదేకర్(Prakash Javadekar). కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజ్ పై వంతెన కు సంబంధించిన 8 పిల్లర్లు మునిగి పోయాయని, మరికొన్ని కుంగి పోయాయని ఆవేదన వ్యక్తం చేశారు.
సరైన అధ్యయనం చేయకుండా, తప్పుడు డిజైనింగ్ చేయడం వల్లనే ఇలా జరిగిందని ప్రకాశ్ జవదేకర్ ఆరోపించారు. తానే కాళేశ్వరానికి డిజైన్ చేశానని గొప్పగా చెప్పారని మరి ఇప్పుడు ఇంత జరిగినా కేసీఆర్ ఎందుకు నోరు విప్పడం లేదంటూ ఎద్దేవా చేశారు బీజేపీ ఎంపీ.
కనీసం నిల్వ ఉన్న నీరంతా విడుదల చేయాలని, రైతులకు రెండో పంట పండేందుక నీరు అందని పరిస్థితి దాపురించిందన్నారు. కోట్లను నీళ్లపాలు చేశాడంటూ ఫైర్ అయ్యారు.
Also Read : MLA Raja Singh : రాజా సింగ్ ఆయుధ పూజ