Pralhad Joshi : దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన హిజాబ్ వివాదంపై ఇవాళ కర్ణాటక హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. హిజాబ్ అన్నది ఇస్లాంలో లేదని, అది తప్పనిసరి కాదని స్పష్టం చేసింది.
ఈ సందర్భంగా హిజాబ్ తీర్పును కోర్టు తీర్పును స్వాగతిస్తున్నామని కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి (Pralhad Joshi)స్పష్టం చేశారు. ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు.
హిజాబ్ ధరించడం అన్నది తమ ప్రాథమిక హక్కు అని, దానిని వద్దనే అధికారం ప్రభుత్వానికి లేదని చెప్పడాన్ని సవాల్ చేస్తూ కొందరు కోర్టును ఆశ్రయించారు.
అన్నింటిని విచారించాక స్పష్టమైన తీర్పు చెప్పిందని గుర్తు చేశారు ప్రహ్లాద్ జోషి. విద్యార్థులు మత పరమైన అంశాలకు ప్రయారిటీ ఇచ్చే కంటే ముందు చదువుపై పెట్టాలని సూచించారు.
తాము ఈ నిర్ణయాన్ని సర్వదా స్వాగతిస్తున్నామని స్పష్టం చేశారు కేంద్ర మంత్రి. ఎవరైనా సరే విద్యా సంస్థల రూల్స్ కు లోబడి ఉండాలని, చదువు కోవాలని సూచించారు.
దీనిని సానుకూల దృక్ఫథంతో అర్థం చేసుకోవాలని అన్నారు జోషి. ఇదే సమయంలో కర్ణాటక హోం శాఖ మంత్రి సైతం మాట్లాడారు. హైకోర్టు ధర్మాసనం ఇచ్చిన తీర్పు ను శిరసావహిస్తామన్నారు. 200 పేజీల తీర్పు చెప్పిందన్నారు.
ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని కూడా కోర్టు సమర్థించిందన్నారు. దీనిని గుర్తించి విలువైన సమయాన్ని చదుకునేందుకు విద్యార్థులు ఫోకస్ పెట్టాలని స్పష్టం చేశారు.
ఇదిలా ఉండగా హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించనున్నట్లు హిజాబ్ యువతుల తరపున వాదించిన న్యాయవాది వెల్లడించారు. 200 పేజీల తీర్పు కాపీని చదివాక నిర్ణయం తీసుకుంటామన్నారు.
Also Read : తప్పు చేస్తే తప్పించండి