Prashant Bhushan Rahul : రాహుల్ యాత్ర‌లో ప్ర‌శాంత్ భూష‌ణ్

తెలంగాణ‌లో కొన‌సాగుతున్న యాత్ర‌

Prashant Bhushan Rahul : రాహుల్ గాంధీ చేప‌ట్టిన భార‌త్ జోడో యాత్ర‌కు జ‌నం బ్ర‌హ్మ‌ర‌థం ప‌డుతున్నారు. రేప‌టితో తెలంగాణ‌లో ఆయ‌న చేప‌ట్టిన యాత్ర ముగుస్తుంది. న‌వంబ‌ర్ 7న సోమ‌వారం మ‌హారాష్ట్ర‌లోకి యాత్ర ప్ర‌వేశిస్తుంది. రాహుల్ గాంధీ త‌మిళ‌నాడులోని క‌న్యాకుమారి నుంచి భార‌త్ జోడో యాత్ర‌ను ప్రారంభించారు.

ఇప్ప‌టి వ‌ర‌కు త‌మిళ‌నాడు, కేర‌ళ‌, క‌ర్ణాట‌క‌, ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రాల‌లో యాత్ర పూర్త‌యింది. అన్ని చోట్లా రాహుల్ యాత్ర‌కు జ‌నం బ్ర‌హ్మ‌రథం ప‌ట్ట‌డం విశేషం. మేధావులు, వివిధ ప్ర‌జా సంఘాల నాయ‌కులు, మేధావులు, క‌వులు, కళాకారులు, జ‌ర్నలిస్టులు, వివిధ రంగాల‌కు చెందిన ప్ర‌ముఖులు రాహుల్ గాంధీని క‌లిశారు.

మ‌రో వైపు సినీ రంగానికి చెందిన పూన‌మ్ కౌర్, పూజా భ‌ట్ రాహుల్ యాత్ర‌లో పాల్గొన్నారు సంఘీభావం తెలిపారు. ఇదే స‌మ‌యంలో మ‌రో న‌టి స్వ‌ర భాస్క‌ర్ ప్ర‌శంస‌ల‌తో ముంచెత్తారు. ప్ర‌ముఖ న‌టుడు ప్ర‌కాశ్ రాజ్ రాహుల్ చేప‌ట్టిన యాత్ర అద్భుత‌మంటూ కొనియాడారు.

ఈ త‌రుణంలో ప్ర‌ముఖ మేధావి , న్యాయ‌వాది ప్ర‌శాంత్ భూష‌ణ్ తెలంగాణ‌లో చేప‌ట్టిన భార‌త్ జోడో యాత్ర‌లో జాయిన్ అయ్యారు. రాహుల్ గాంధీకి త‌న సంఘీభావాన్ని ప్ర‌క‌టించారు(Prashant Bhushan Rahul) . ఆయ‌న యాత్ర‌లో చేర‌డం ప్రాధాన్య‌త సంత‌రించుకుంది. ఇక ఈ యాత్ర సెప్టెంబ‌ర్ 7న ప్రారంభ‌మైంది.

ఇవాల్టితో 60వ రోజుకు చేరింది. 1300 కిలోమీట‌ర్ల‌కు పైగా సాగింది ఇప్ప‌టి వ‌ర‌కు. ఇక మ‌రాఠా నుంచి మ‌ధ్య ప్ర‌దేశ్ మీదుగా కాశ్మీర్ కు చేరుతుంది. ఆదివారం జ‌రిగిన పాద‌యాత్ర‌లో పాల్గొన‌డం ప్రాధాన్య‌త సంత‌రించుకుంది.

మొత్తంగా యాత్ర బీజేపీలో బుగులు రేపుతోంది.

Also Read : కొలీజియం కాదు స‌మ‌ర్థులైన జ‌డ్జీలు కావాలి

Leave A Reply

Your Email Id will not be published!