Prashant Kishor : అక్టోబ‌ర్ 2 నుంచి పీకే పాద‌యాత్ర‌

ప్ర‌క‌టించిన పొలిటిక‌ల్ స్ట్రాట‌జిస్ట్

Prashant Kishor: ఇండియ‌న్ పొలిటిక‌ల్ స్ట్రాట‌జిస్ట్ ప్ర‌శాంత్ కిషోర్ సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు. ఆయ‌న గ‌త కొంత కాలంగా పార్టీ పెడ‌తార‌ని జోరుగా ప్ర‌చారం జ‌రిగింది. కొన్ని రోజుల కింద‌ట కాంగ్రెస్ పార్టీలో చేర‌తార‌ని ఊహాగానాలు ఊపందుకున్నాయి.

వీటన్నింటిని ఆయ‌న కొట్టి పారేశారు. తాను కొత్త‌గా పార్టీని పెట్ట‌డం లేదంటూ కుండ బ‌ద్ద‌లు కొట్టారు. ప‌నిలో ప‌నిగా పార్టీ కాకుండా పాద‌యాత్ర చేప‌ట్ట‌నున్న‌ట్లు ప్ర‌క‌టించారు.

తాను ఎక్కువ‌గా ఇష్ట‌ప‌డే జాతిపిత మ‌హాత్మా గాంధీ పుట్టిన రోజు అక్టోబ‌ర్ 2 నుంచి గుజ‌రాత్ లోని ప‌శ్చిమ చంపార్ లోని గాంధీ ఆశ్ర‌మం నుంచి 3, 000 వేల కిలోమీట‌ర్ల మేర పాద‌యాత్ర చేప‌ట్ట‌నున్న‌ట్లు వెల్ల‌డించారు(Prashant Kishor).

తాను ఎలాంటి పార్టీ పెట్ట‌బోవ‌డం లేద‌న్నారు. ఇదిలా ఉండ‌గా తాను ఏర్పాట చేసిన ఐప్యాక్ సంస్థ త‌న ప‌ని తాను చేసుకుంటుంద‌న్నారు.

పొలిటిక‌ల్ స్ట్రాట‌జిస్ట్ గా తాను కంటిన్యూగా కొన‌సాగుతాన‌ని చెప్పారు. పొలిటిక‌ల్ పార్టీ కంటే పాద‌యాత్ర చేసేందుకే తాను నిర్ణ‌యం తీసుకున్నానని తెలిపారు(Prashant Kishor).

భార‌త దేశంలో అత్యంత విజ‌య‌వంత‌మైన రాజ‌కీయ వ్యూహ‌క‌ర్త‌గా పేరొందారు ప్ర‌శాంత్ కిషోర్. ఆయ‌న హైద‌రాబాద్ అమ్మాయిని పెళ్లి చేసుకున్నారు. వ‌ర‌ల్డ్ బ్యాంక్ లో ప‌ని చేశారు.

ఆ త‌ర్వాత మోదీ ఎన్నిక‌ల‌కు వ్యూహ‌క‌ర్త‌గా ఉన్నారు. ఆయ‌న ప్ర‌ధానిగా విజ‌యం సాధించ‌డంలో కీల‌క పాత్ర పోషించారు. అనంత‌రం ప‌శ్చిమ బెంగాల్, పంజాబ్ , త‌మిళ‌నాడు, ఆంధ్రప్ర‌దేశ్, ఢిల్లీలో ప‌ని చేశారు.

ఆయ‌న స‌క్సెస్ రేట్ ప‌రంగా చూస్తే 90 శాతం ప్ల‌స్ గా ఉంటే 10 శాతం మైన‌స్ గా ఉంది.

 

Also Read : శ్రీ‌వారి భ‌క్తుల‌కు తీపి క‌బురు

Leave A Reply

Your Email Id will not be published!