Prashant kishor : పీకేకు గాయం పాద‌యాత్ర‌కు దూరం

వెల్ల‌డించిన ప్ర‌శాంత్ కిషోర్

ప్ర‌ముఖ రాజ‌కీయ వ్యూహ‌క‌ర్త ప్ర‌శాంత్ కిషోర్ గాయ‌ప‌డ్డారు. ఈ విష‌యాన్ని స్వ‌యంగా సోమ‌వారం పీకేనే వెల్ల‌డించారు. ఆయ‌న బీహార్ రాష్ట్రంలో జ‌న్ సూర‌జ్ పేరుతో యాత్ర చేప‌ట్టారు. ఇదిలా ఉండ‌గా 15 రోజుల త‌ర్వాత యాత్ర పునః ప్రారంభం అవుతుంద‌ని స్ప‌ష్టం చేశారు. అంత వ‌ర‌కు తాను చికిత్స తీసుకోవాల్సి ఉంటుంద‌ని తెలిపారు పీకే.

యాత్ర సంద‌ర్బంగా స‌మ‌స్తి పూర్ లో ప్ర‌శాంత్ కిషోర్ ఈ విష‌యాన్ని వెల్ల‌డించారు. ప‌క్షం రోజులు లేదా నెల రోజులు ప‌ట్ట‌వ‌చ్చ‌ని పేర్కొన్నారు. వాలి సాహ్లి నుండి తిరిగి వ‌చ్చిన త‌ర్వాత ఎడ‌మ కాలంలో నొప్పి వ‌చ్చింద‌ని , దీంతో వైద్యులు విశ్రాంతి తీసుకోవాల‌ని సూచించార‌ని వెల్ల‌డించారు ప్ర‌శాంత్ కిషోర్.

ఇదిలా ఉండ‌గా అక్టోబ‌ర్ 2న గాంధీ జ‌యంతి రోజున పీకే జ‌న్ సూర‌జ్ పేరుతో పాద‌యాత్ర‌కు శ్రీ‌కారం చుట్టారు. ప్ర‌జ‌ల‌తో మ‌మేకం అవుతూ మెరుగైన ప్ర‌జా పాల‌న రావాల‌ని కోరుతున్నారు. ఈ మేర‌కు పీకే ప్ర‌జ‌ల‌ను చైత‌న్య‌వంతం చేసే ప‌నిలో ప‌డ్డారు. కానీ అనుకోకుండా గాయ‌ప‌డ‌డం ఒకింత ఇబ్బందిక‌రంగా మారింది. కాగా త‌న‌కు ఎలాంటి ఆరోగ్య స‌మ‌స్య లేద‌ని కానీ అధ్వాన్న‌మైన రోడ్ల కార‌ణంగా కాలికి గాయ‌మైంద‌న్నారు. ఆయ‌న సీఎం నితీశ్ కుమార్ ను టార్టెగ్ చేశారు.

Leave A Reply

Your Email Id will not be published!