Prashant kishor Rahul : రాహుల్ యాత్రపై పీకే కామెంట్స్

వాళ్లు పెద్ద వాళ్లు మేమెక్క‌డ

Prashant kishor Rahul : ఇండియ‌న్ పొలిటిక‌ల్ స్ట్రాటిజిస్ట్ ప్ర‌శాంత్ కిషోర్ ఆసక్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. కాంగ్రెస్ నాయ‌కుడు రాహుల్ గాంధీ చేప‌ట్టిన భార‌త్ జోడో యాత్ర ప్ర‌స్తుతం హ‌ర్యానాలో కొన‌సాగుతోంది. ఈ సంద‌ర్భంగా ఇవాళ రాహుల్ ఓ ఐకాన్ గా మారి పోయారు. మ‌రో వైపు బీహార్ లో ప్ర‌శాంత్ కిషోర్ కూడా జ‌న్ ప‌రివ‌ర్త‌న్ పేరుతో యాత్ర చేప‌ట్టారు.

ఇంకో వైపు బీహార సీఎం నితీశ్ కుమార్ కూడా పాద‌యాత్ర‌కు శ్రీ‌కారం చుట్టారు. దానికి స‌మాధాన్ యాత్ర అని పేరు పెట్టారు. దేశంలో పాద‌యాత్ర‌ల కాలం న‌డుస్తోంది. ఈ త‌రుణంలో ప్ర‌శాంత్ కిషోర్(Prashant kishor) రాహుల్ గాంధీ యాత్ర ఎక్క‌డ త‌న యాత్ర ఎక్క‌డ అని పేర్కొన్నారు. ఒక ర‌కంగా ప్ర‌శంస‌నా లేక వ్యంగ్యంతో కూడిన వ్యాఖ్య‌లా అనేది న‌ర్మ గ‌ర్భంగా మాట్లాడారు.

ఆయ‌న అంత‌కు ముందు కాంగ్రెస్ పార్టీతో సుదీర్ఘ మంత‌నాలు జ‌రిపారు. కానీ చ‌ర్చ‌లు విఫ‌లం అయ్యాయి. పార్టీలో చేరాల‌ని అనుకున్నాడు. కానీ ఎందుక‌నో ప్ర‌శాంత్ కిషోర్ మౌనంగా ఉండి పోయారు. త‌న స్వ‌రాష్ట్రంలో జ‌న్ సురాజ్ ను ప్రారంభించాడు. రాహుల్ గాంధీ 3,500 కిలోమీట‌ర్ల పాద‌యాత్ర‌లో ఉన్నారు.

నాకు కిలోమీట‌ర్ల ప‌ట్టింపు లేద‌ని స్ప‌ష్టం చేశారు ప్రశాంత్ కిషోర్ . నేను గ‌త అక్టోబ‌ర్ నుండి నాన్ స్టాప్ గా న‌డుస్తూనే ఉన్నాన‌ని చెప్పారు. కానీ దానిని నా శారీర‌క దృఢ‌త్వానికి నిద‌ర్శ‌నంగా చూపించాల‌ని అనుకోవ‌డం లేద‌న్నారు పీకే. ఇదిలా ఉండ‌గా 2014లో న‌రేంద్ర మోదీని ప‌వ‌ర్ లోకి తీసుకు రావ‌డంలో ప్ర‌చారం వెనుక ప్ర‌శాంత్ కిషోర్(Prashant kishor) ఉన్నారు.

2021లో ప‌శ్చిమ బెంగాల్ లో పీకే మార్క్ క‌నిపించింది. అంత‌కు ముందు త‌మిళ‌నాడులో కూడా హ‌వా కొన‌సాగింది.

Also Read : మంత్రి కారును ఢీకొట్టిన ట్ర‌క్కు

Leave A Reply

Your Email Id will not be published!