Prashant Kishor : జ‌గ‌న్ రెడ్డికి స‌హాయం పీకే విచారం

రాజ‌కీయ వ్యూహ‌క‌ర్త షాకింగ్ కామెంట్స్

Prashant Kishor : ఇండియ‌న్ పొలిటికల్ స్ట్రాట‌జిస్ట్ ప్ర‌శాంత్ కిషోర్ షాకింగ్(Prashant Kishor) కామెంట్స్ చేశారు. ఆయ‌న ప్ర‌స్తుతం బీహార్ లో పాద‌యాత్ర చేప‌ట్టారు. ప్ర‌జ‌లతో మ‌మేకం అవుతూ వారి స‌మ‌స్య‌ల‌ను తెలుసుకునే ప్ర‌య‌త్నం చేశారు. పాద‌యాత్ర‌లో భాగంగా సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేయ‌డం క‌ల‌క‌లం రేపింది.

ఏపీలో జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డికి స‌హాయం చేయ‌డం తాను చేసిన పెద్ద త‌ప్పు అంటూ విచారం వ్య‌క్తం చేశారు. త‌న జీవిత కాలంలో వివిధ రాజ‌కీయ పార్టీల‌కు చెందిన నాయ‌కులు త‌మ ఆశయాల‌ను సాకారం చేయ‌డంలో , సీఎంలు కావ‌డానికి స‌హాయం చేయ‌డంలో త‌న స‌మ‌యాన్ని చాలా వృధా చేశానంటూ వాపోయారు.

ఆయ‌న ఇండియ‌న్ పొలిటిక‌ల్ యాక్ష‌న్ క‌మిటీ (ఐప్యాక్) ఫౌండ‌ర్ , పొలిటిక‌ల్ స్ట్రాట‌జిస్ట్ గా ప‌ని చేస్తూ వ‌చ్చారు. మొద‌ట ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీకి ప‌ని చేశారు. ఆ త‌ర్వాత ఆయ‌న ప‌వ‌ర్ లోకి వ‌చ్చాక అక్క‌డి నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చారు. పంజాబ్ లో ప‌ని చేశారు. ఢిల్లీలో ఆప్ కు స‌పోర్ట్ చేశారు.

ప‌శ్చిమ బెంగాల్ లో టీఎంసీ చీఫ్ మ‌మ‌తా బెన‌ర్జీకి స‌హాయం చేశారు. అంత‌కు ముందు ఆంధ్ర ప్ర‌దేశ్ లో వైసీపీ చీఫ్ , సీఎం సందింటి జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ప‌వ‌ర్ లోకి వచ్చేలా చేయ‌డంలో కీల‌క పాత్ర పోషించాడు ప్ర‌శాంత్ కిషోర్(Prashant Kishor). ఇదే స‌మ‌యంలో త‌మిళ‌నాడులో డీఎంకే చీఫ్, సీఎం ఎంకే స్టాలిన్ కు స‌పోర్ట్ గా నిలిచాడు.

పంజాబ్ లో ఓట‌మి పాలైతే త‌మిళ‌నాడు, ప‌శ్చిమ బెంగాల్ , ఏపీలో స‌క్సెస్ అయ్యాడు పీకే. ప్ర‌స్తుతం తెలంగాణ‌లో టీఆర్ఎస్ (బీఆర్ఎస్) చీఫ్, సీఎం కేసీఆర్ తో జ‌త క‌ట్టాడు.

Also Read : ఆకునూరి మురళి రాజీనామాకు ఓకే

Leave A Reply

Your Email Id will not be published!