Prashant Kishor : సమాధాన్ యాత్ర పేరుతో నితీశ్ మోసం
పొలిటికల్ స్ట్రాటజిస్ట్ ప్రశాంత్ కిషోర్
Prashant Kishor : భారతీయ పొలిటికల్ స్ట్రాటజిస్ట్ గా పేరొందిన ప్రశాంత్ కిషోర్ సంచలన కామెంట్స్ చేశారు. బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ ను ఏకి పారేశారు. సమాధాన్ యాత్ర పేరుతో జనాన్ని మోసం చేస్తున్నారంటూ ఆరోపించారు. ఈ యాత్ర వల్ల రాష్ట్రానికి ఒరిగేది ఏమీ ఉండదన్నారు. కాంగ్రెస్ పార్టీ చేపట్టిన భారత్ జోడో యాత్రకు నితీశ్ కుమార్(Prashant Kishor) హాజరు కాక పోవడాన్ని తప్పు పట్టారు.
ఆయన నైజం ఏమిటో తెలియ చేస్తుందన్నారు. ప్రతిపక్ష ఐక్యత గురించి నితీశ్ కుమార్ మాటలు ఒక ప్రహసనంగా ఉన్నాయని ఎద్దేవా చేశారు ప్రశాంత్ కిషోర్. రాజకీయ వ్యూహకర్తగా మారిన రాజకీయ వేత్త ప్రశాంత్ కిషోర్ కీలక వ్యాఖ్యలు చేయడం కలకలం రేపుతోంది.
మంత్రులు, ఉన్నతాధికారులతో పదే పదే సమావేశాలు నిర్వహించడం వల్ల ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కారం కావని, అలా అనుకుంటే పొరపాటు అని స్పష్టం చేశారు.
జన్ పరివర్తన్ పేరుతో ప్రశాంత్ కిషోర్ పాదయాత్ర చేపట్టారు బీహార్ రాష్ట్రంలో. ఇదిలా ఉండగా రాష్ట్రంలోని గోపాల్ గంజ్ జిల్లాలోని బరౌలీలో మీడియాతో మాట్లాడారు ప్రశాంత్ కిషోర్(Prashant Kishor) . జేడీయూ చీఫ్ గతంలో ఎన్నో పాదయాత్రలు చేశారని కానీ ఇప్పుడు చేస్తున్న యాత్ర కేవలం జనాన్ని మభ్య పెట్టడానికేనని ఎద్దేవా చేశారు.
రాష్ట్రంలో కొనసాగుతున్న సంక్షేమ కార్యక్రమాలు, పెండింగ్ లో ఉన్న పనుల స్థితిగతులను అంచనా వేయడమే జేడీయూ సమాధాన యాత్ర లక్ష్యం. దేశంలోని వివిధ ప్రాంతాల్లో కాంగ్రెస్ యాత్రకు ఇతర రాజకీయ పార్టీల నాయకులు హాజరవుతున్నారని పేర్కొన్నారు ప్రశాంత్ కిషోర్. కానీ ఎందుకని నితీశ్ కుమార్ పాల్గొనలేదని ప్రశ్నించారు.
Also Read : చలిని లెక్క చేయని రాహుల్