Prashant Kishor : అవినీతికి అందలం పాలన అస్తవ్యస్తం – పీకే
మహా ఘట్ బంధన్ పై ఆగ్రహం
Prashant Kishor : భారతీయ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్(Prashant Kishor) షాకింగ్ కామెంట్స్ చేశారు. తాజాగా జరిగిన ఉప ఎన్నికల్లో రాష్ట్రంలో అధికారంలో ఉన్న జేడీయూ, కాంగ్రెస్, ఆర్జేడీ తో కూడిన మహా ఘట్ బంధన్ సర్కార్ కూటమికి అపజయం మిగిలింది. ఈ సందర్బంగా అపజయంపై స్పందించారు ప్రశాంత్ కిషోర్.
శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో ఆయన 3,500 కిలోమీటర్ల పాదయాత్రకు శ్రీకారం చుట్టారు. ఈ సందర్బంగా ప్రజలతో కలుస్తున్నారు. వారితో సంభాషిస్తున్నారు. రాష్ట్రంలో అవినీతి, అక్రమాలకు అడ్డు అదుపు లేకుండా పోయిందని ఆరోపించారు ప్రశాంత్ కిషోర్.
దీంతో ప్రజలు ప్రస్తుత ప్రభుత్వం పట్ల విసిగి పోయారని అందుకే ఉప ఎన్నికల్లో గట్టిగా బుద్ది చెప్పారని అన్నారు. ఇదిలా ఉండగా యువతకు ప్రత్యామ్నాయం లేకుండా పోయిందని, ఇప్పటి వరకు ఖాళీగా ఉన్న జాబ్స్ ను ఎందుకు నింపడం లేదంటూ ప్రశ్నించారు ప్రశాంత్ కిషోర్(Prashant Kishor) . తాను పాదయాత్ర చేస్తున్న సందర్బంగా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకుంటున్నానని చెప్పారు.
ఏ ఒక్కరు ప్రస్తుత సర్కార్ పట్ల సంతోషంగా లేరని మండిపడ్డారు. ఇదిలా ఉండగా 2018లో జేడీయూలో పీకే చేరారు. ఆ తర్వాత సీఎం నితీశ్ కుమార్ తో పొసగక బయటకు వచ్చారు. మళ్లీ ఎన్నికల వ్యూహకర్తగా మారారు. అటు తమిళనాడులో ఇటు పశ్చిమ బెంగాల్ లో డీఎంకే, టీఎంసీని గెలిపించడంలో కీలక పాత్ర పోషించారు ప్రశాంత్ కిషోర్.
బీహార్ లో అవినీతిని కంట్రోల్ చేయడంలో సీఎం నితీశ్ కుమార్ విఫలమయ్యారు. ఆయన సెక్యూరిటీ లేకుండా చిన్న గ్రామంలో కూడా ప్రవేశించ లేరన్నారు పీకే.
Also Read : ప్రియాంక చేతిలో ‘దైవభూమి’ భవితవ్యం