Prashant Kishor : బీహార్ స‌ర్కార్ కు జ‌నాద‌ర‌ణ లేదు – పీకే

10 ల‌క్ష‌ల ఉద్యోగాలు ఇస్తే ప్ర‌జా యాత్ర ఆపేస్తా

Prashant Kishor : ప్ర‌ముఖ రాజ‌కీయ వ్యూహ‌క‌ర్త ప్ర‌శాంత్ కిషోర్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. బీహార్ లో 17 బీజేపీ బంధానికి చెక్ పెడుతూ కొత్త‌గా ఆర్జేడీ, కాంగ్రెస్, ఇత‌ర పార్టీల‌తో క‌లిసి సీఎం నితీశ్ కుమార్ మ‌హా ఘ‌ట్ బంధ‌న్ ( మ‌హా కూట‌మి) పేరుతో కొత్త ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేశారు.

ఆయ‌న‌తో పాటు డిప్యూటీ సీఎంగా తేజ‌స్వి యాద‌వ్ కు చాన్స్ ఇచ్చారు. 31 మంది మంత్రుల‌తో కేబినెట్ కొలువు తీరింది. ఈ త‌రుణంలో ప్ర‌శాంత్ కిషోర్ చేసిన వ్యాఖ్య‌లు క‌ల‌క‌లం రేపుతున్నాయి.

ఆయ‌న గ‌తంలో జేడీయూలో చేరారు. ఆ త‌ర్వాత ఏమైందో ఏమో కానీ పార్టీకి గుడ్ బై చెప్పారు. అనంత‌రం జ‌న్ సురాజ్ అభియాన్ పేరుతో జ‌నంలోకి యాత్ర చేప‌ట్టారు.

మ‌రో వైపు వ్యూహ‌క‌ర్త‌గా త‌న ప‌ని తాను చేసుకుంటూ పోతున్నారు. ఈ త‌రుణంలో కొత్త‌గా ఏర్ప‌డిన మ‌హా కూట‌మికి జ‌నంలో ఆద‌ర‌ణ లేద‌న్నారు.

ప‌నిలో ప‌నిగా తాను చేప‌ట్ట‌బోయే యాత్ర‌ను ఇప్ప‌టికే సీఎం ప్ర‌క‌టించిన 20 ల‌క్ష‌ల ఉపాధి, తేజ‌స్వి యాద‌వ్ ప్ర‌క‌టించిన 10 ల‌క్ష‌ల ఉద్యోగాలు గ‌నుక భ‌ర్తీ చేస్తే నిలిపి వేస్తానంటూ ప్ర‌క‌టించారు ప్ర‌శాంత్ కిషోర్(Prashant Kishor).

త‌న క్యాంపెయిన్ ను త‌క్ష‌ణ‌మే నిలిపి వేస్తాన‌ని, బేష‌ర‌తుగా నితీశ్ కుమార్ ప్ర‌భుత్వానికి మ‌ద్ద‌తు ఇస్తాన‌ని వెల్ల‌డించారు. బీహార్ లోని స‌మ‌స్తి పూర్ లో త‌న మ‌ద్ద‌తుదారులు ఏర్పాటు చేసిన స‌మావేశంలో ప్ర‌శాంత్ కిషోర్ పాల్గొని ప్ర‌సంగించారు.

ప్ర‌జ‌ల కోసం ప‌ని చేయాల్సిన సీఎం నితీశ్ కుమార్ త‌న ప‌ద‌విని మాత్రం వీడేందుకు ఇష్ట ప‌డ‌డం లేద‌న్నారు పీకే.

Also Read : ప‌ర్మిష‌న్ కావాలంటే ఎన్ఐఏ ఇవ్వాల్సిందే

Leave A Reply

Your Email Id will not be published!