Pratibha Singh : సీఎం రేసు నుంచి ప్రతిభా సింగ్ ఔట్
దైవభూమిలో సీఎం ఎంపికపై ఉత్కంఠ
Pratibha Singh : హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో 40 సీట్లు గెలుపొందిన కాంగ్రెస్ పార్టీకి సీఎం పదవికి సంబంధించి అభ్యర్థిని ఎంపిక చేయడం తలనొప్పిగా మారింది. నిన్నటి దాకా తమకే పదవి కావాలంటూ ప్రతిభా సింగ్ మద్దతుదారులు పెద్ద ఎత్తున డిమాండ్ చేశారు. ఆపై పరిశీలకులుగా వచ్చిన రాజీవ్ శుక్లా, సీఎం భూపేష్ బాఘేల్ ఎదుట నిరసనకు దిగారు.
నానా హంగామా సృష్టించారు. దీంతో పార్టీ హైకమాండ్ సిమ్లా లోని రాడిసన్ హోటల్ లో గెలుపొందిన ఎమ్మెల్యేలతో కీలక భేటీ నిర్వహించింది. ఈ మేరకు ఎవరు సీఎంగా ఎన్నికైనా ఎమ్మెల్యేలు మద్దతు తెలుపాలంటూ తీర్మానం చేశారు. దీంతో సీఎం ఎంపిక వ్యవహారం ఢిల్లీకి చేరింది.
హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన ఎన్నికల్లో పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ ముందుండి నడిపించారు. దీంతో హైకమాండ్ అభ్యర్థిని ఖరారు చేసే బాధ్యతను పూర్తిగా ప్రియాంకకే అప్పగించారు. దీంతో నిన్నటి దాకా సీఎం రేసులో ఉన్న ప్రతిభా సింగ్(Pratibha Singh) తప్పుకున్నటేనని సమాచారం.
ఇదిలా ఉండగా మొత్తం 40 మంది ఎమ్మెల్యేలలో 25 మందికి పైగా ఎమ్మెల్యేలు ప్రస్తుతం హిమాచల్ ప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ గా ఉన్న సుఖ్విందర్ సింగ్ సుఖు ముందు వరుసలో ఉన్నట్లు టాక్. మాజీ సీఎం వీరభద్ర సింగ్ భార్యగా ప్రతిభా సింగ్ పేరొందారు. ఆమె ఎంపీగా ఉన్నారు.
మంచి పట్టుంది రాష్ట్రంలో. ఇదే సమయంలో కీలకమైన తమ కుటుంబాన్ని పక్కన పెట్టడం దారుణమన్నారు ప్రతిభా సింగ్. మొత్తంగా ప్రియాంక గాంధీ ఎవరి పేరు ఖరారు చేస్తుందనేది ఉత్కంఠగా మారింది.
Also Read : దైవభూమిలో స్థిరమైన సర్కార్ – సుఖు