Supreme Court : ప్రార్థనలు మతాలకు పరిమితం కాదు
నైతిక విలువలు పెంపొందించడమే లక్ష్యం
Supreme Court : భారత దేశ సర్వోన్నత ప్రధాన న్యాయ స్థానం సుప్రీంకోర్టు(Supreme Court) కీలక వ్యాఖ్యలు చేసింది. నైతిక విలువలను పెంపొందించే ప్రార్థనలు మతాలకు పరిమితం కాదని తీర్పు చెప్పింది.
కేంద్రీయ విద్యాలయాల్లో ఉదయం జరిగే సమావేశాల్లో సంస్కృత శ్లోకాలను తప్పనిసరిగా పఠించాలని కేంద్ర సర్కార్ 2012 డిసెంబర్ లో ఉత్తర్వులు జారీ చేసింది.
ఇందుకు అనుగుణంగా దేశంలోని అన్ని కేంద్రీయ విద్యాలయాల్లో దీనిని పాటిస్తూ వస్తున్నారు. ఇదిలా ఉండగా సంస్కృత శ్లోకాలను కచ్చితంగా పఠించాలని జారీ చేసిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ పిటిషన్ దాఖలైంది సుప్రీంకోర్టులో.
దీనిపై విచారించిన కోర్టు ఈ కీలక వ్యాఖ్యలు చేసింది. న్యాయమూర్తులు ఇందిరా బెనర్జీ, సూర్యకాంత్ , ఎం.ఎం. సుందరేష్ లతో కూడిన ధర్మాసనం నైతిక విలువలను పెంపొందించేలా ఇలాంటి పారాయణాలు జరుగుతాయన్నారు.
బడుల్లో పెంపొందించిన విలువలను తాము ఇప్పటికీ కొనసాగిస్తున్నామని స్పష్టం చేసింది. ఈ ప్రాథమిక విద్య చాలా ముఖ్యమైనదని పేర్కొంది. న్యాయవాది వినాయక్ షా 2017లో కోర్టును ఆశ్రయించారు.
రాజ్యాంగంలోని ఆర్టికల్ 28(1) ప్రకారం మత పరమైన బోధనలు చేయరాదని పేర్కొన్న విషయాన్ని ప్రస్తావించారు. 2019 జనవరిలో ఇద్దరు న్యాయమూర్తుల బెంచ్ ఈ విషయాన్ని పద్ద బెంచ్ కు నివేదించింది.
ఏదైనా రాష్ట్ర నిధులతో కూడిన విద్యా సంస్థలో దీనిని నిర్వహిస్తూ వస్తున్నారు. కొందరు పేరెంట్స్ నాస్తికులు, అజ్ఞేయవాదులు, సంశయవాదులు, హేతువాదులు, ఇతరులకు సంబంధించిన వారంతా అభ్యంతరం తెలియ చేస్తారని పేర్కొన్నారు.
ఈ సమయంలో ఎలా వారి పిల్లలు ప్రార్థనలు చేస్తారంటూ ప్రశ్నించారు. అయితే నైతిక విలువల విషయంలో ఎవరైనా సరే ఏ మతానికి చెందిన వారైనా సరే పాటించాల్సిందేనంటూ తీర్పు చెప్పింది.
Also Read : యుద్ధం..కరోనా పెను ప్రమాదం – మోదీ