Ukraine Russia Talks : కొన‌సాగుతున్న యుద్ధం చ‌ర్చ‌ల‌కు సిద్దం

ర‌ష్య‌న్ ప్రెసిడెంట్ పుతిన్ ప్ర‌తిపాద‌న‌

Ukraine Russia Talks  : ఉక్రెయిన్ పై ర‌ష్యా ఏక‌ప‌క్ష దాడుల‌తో యావ‌త్ ప్ర‌పంచం విస్మ‌యానికి లోన‌వుతోంది. ఆర్మీ గ‌నుక లొంగి పోతే తాము చ‌ర్చ‌ల‌కు సిద్ద‌మ‌ని ఇప్ప‌టికే ప్ర‌క‌టించార రష్యా చీఫ్ వ్లాదిమిర్ పుతిన్.

తాజాగా పుతిన్ చేసిన ప్ర‌తిపాద‌న‌ల‌కు ఉక్రెయిన్ చీఫ్ వ్లాదిమిర్ జెలెన్స్కీ అంగీకారం చెప్పిన‌ట్లు స‌మాచారం. ఈ విష‌యాన్ని అధికారికంగా ప్ర‌క‌టించారు ఆ దేశ మీడియా కార్య‌ద‌ర్శి నికి ఫ‌రోవ్(Ukraine Russia Talks ).

ఈ మేర‌కు తాము ముందు నుంచి యుద్దం కోరుకోవ‌డం లేద‌ని, ఏ ప్ర‌తిపాద‌న‌ల‌తో ముందుకు వ‌స్తారో ముందు చ‌ర్చించేందుకు సిద్ద‌మ‌ని, ఆ త‌ర్వాత ఒప్పందాలు చేసుకునేందుకు స‌న్నద్ధంగా ఉన్న‌ట్లు వెల్ల‌డించిన‌ట్లు ఆయ‌న ప్ర‌క‌టించారు.

ర‌ష్యాతో శాంతి చ‌ర్చ‌లు సాగించేందుకు మా త‌ర‌పున‌, దేశం త‌ర‌పున స‌న్న‌ద్ద‌మై ఉన్నామ‌ని స్ప‌ష్టం చేశార‌ని తెలిపారు. కాల్పుల విర‌మ‌ణ‌కు కూడా జెలెన్స్కీ సైతం ఆమోదం తెలిపార‌ని పేర్కొన్నారు.

చ‌ర్చ‌ల‌ను తిర‌స్క‌రిస్తున్న‌ట్లు వ‌స్తున్న వార్త‌ల్ని, ప్ర‌చారాన్ని న‌మ్మ‌వ‌ద్ద‌ని కోరారు. కావాల‌ని కొంద‌రు చేస్తున్న దుష్ప్ర‌చారంగా ధ్వ‌జ‌మెత్తారు నికి ఫ‌రోవ్. శాంతి, కాల్పుల విమ‌ర‌ణ ఒప్పందానికి ఉక్రెయిన్ క‌ట్టుబ‌బి (Ukraine Russia Talks )ఉంద‌ని స్ప‌ష్టం చేశారు.

త‌మ దేశం శాశ్వ‌త సిద్ధాంతం కూడా ఇదేన‌ని మ‌రోసారి వెల్ల‌డించారు. ర‌ష్యా చీఫ్ చేసిన ప్ర‌తిపాద‌న‌ల‌ను తాము ఓకే చెపుతున్న‌ట్లు త‌మ అధికారిక ఫేస్ బుక్ వేదిక‌గా ప్ర‌క‌టించారు.

చ‌ర్చ‌ల ద్వారానే శాంతి నెల‌కొంటుంద‌ని, స‌మ‌స్య‌లు ప‌రిష్కారం అవుతాయ‌ని పేర్కొన్నారు. ఇదిలా ఉండ‌గా సామాజిక మాధ్యమాల‌లో త‌ప్పుడు స‌మాచారం వ్యాప్తి చెందుతోందంటూ ఉక్రెయిన్ ప్రెసిడెంట్ ఆరోపించారు.

తాము యుద్దాన్ని ఆప బోమంటూ మ‌రోసారి ప్ర‌క‌టించారు.

 Also Read : జ‌నం చేతుల్లో ఆయుధాలు

Leave A Reply

Your Email Id will not be published!