Draupadi Murmu Yadadri : నరసింహుడి సేవలో రాష్ట్రపతి
యాదగిరిగుట్టను దర్శించుకున్న రాష్ట్రపతి
Draupadi Murmu Yadadri : తెలంగాణలో ఐదు రోజుల టూర్ లో భాగంగా దేవాలయాలను సందర్శించుకునే పనిలో బిజీగా ఉన్నారు దేశ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. రాష్ట్రపతిగా ప్రమాణ స్వీకారం చేసిన ఏపీలో మొదట సందర్శించారు. అక్కడ తిరుమలలో కొలువైన శ్రీ వేంకటేశ్వరుడిని దర్శించుకున్నారు.
అనంతరం తెలంగాణలో భద్రాచలంలో కొలువు తీరిన సీతా రాములోరి ఆశీర్వాదం పొందారు. ఇక అక్కడి నుంచి ముచ్చింతల్ లోని శ్రీశ్రీశ్రీ త్రిదండి రామనుజ చిన్న జీయర్ సారథ్యంలో ఏర్పాటు చేసిన రామానుజాచార్య విగ్రహాన్ని దర్శించుకుని అక్కడి విశేషాలు తెలుసుకున్నారు.
ఆమెకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ఇక్కడి విశిష్టతను తెలియ చేశారు. తాజాగా శుక్రవారం యాదగిరిగుట్ట ను దర్శించుకున్నారు. రాష్ట్రపతికి పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. గుట్టలో కొలువు తీరిన శ్రీ లక్ష్మీ నరసింహ్మ స్వామికి పూజలు చేశారు. గర్భాలయంలో కలియ తిరిగారు.
దర్శనం చేసుకున్న అనంతరం ద్రౌపది ముర్ముకు(Draupadi Murmu Yadadri) ఆలయ ప్రధాన అర్చకులు వేద ఆశీర్వచనం అందజేశారు. మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి, జగదీశ్ రెడ్డి, సత్యవతి రాథోడ్ స్వామి వారికి సంబంధించిన చిత్ర పటం, తీర్థ ప్రసాదాలను రాష్ట్రపతికి అందజేశారు. ఆ తర్వాత యాదగిరిగుట్ట ప్రధాన ఆలయ పరిసరాలను ద్రౌపది ముర్ము పరిశీలించారు.
అక్కడే ఏర్పాటు చేసిన అద్దాల మండపం , ఫోటో చిత్ర ప్రదర్శనను తిలకించారు. ఇదిలా ఉండగా రాష్ట్రపతి పర్యటన సందర్భంగా భారీ ఎత్తున సెక్యూరిటీని ఏర్పాటు చేశారు. ఆమె వెంట రాష్ట్ర గవర్నర్ తమిళి సై సౌందర రాజన్ ఉన్నారు. ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.
Also Read : రైల్వేల ఆధునీకరణకు పెట్టుబడులు