President Draupadi Murmu : లండన్ కు చేరుకున్న రాష్ట్రపతి
క్వీన్ ఎలిజబెత్ అంత్యక్రియలకు హాజరు
President Draupadi Murmu : బ్రిటన్ క్వీన్ ఎలిజబెత్ అంత్యక్రియలకు హాజరయ్యేందుకు భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము లండన్ కు చేరుకున్నారు. సెప్టెంబర్ 19న వెస్ట్ మినిస్టర్ అబ్బేలో క్వీన్ ఎలిజబెత్ -2 అంత్యక్రియలు నిర్వహించనున్నారు.
ఇప్పటికే పలు దేశాధినేతలు లండన్ కు చేరుకుంటున్నారు. మూడు రోజుల విదేశీ పర్యటనలో ఉన్నారు రాష్ట్రపతి. భారత ప్రభుత్వం తరపున సంతాపం తెలియ చేసేందుకు ద్రౌపది ముర్ము(President Draupadi Murmu) అక్కడికి చేరుకున్నారు.
ఇదిలా ఉండగా సెప్టెంబర్ 8న స్కాట్లాండ్ లోని బాల్మోరల్ కాజిల్ లో తన నివాసంలో 96 ఏళ్ల వయసులో మరణించారు క్వీన్ ఎలిజబెత్. సోమవారం నిర్వహించే అంత్యక్రియలకు హాజరవుతారు.
ఆదివారం సాయంత్రం కింగ్ చార్లెస్ -3 బకింగ్ హామ్ ప్యాలెస్ లో ప్రపంచ నాయకులకు ఇచ్చే రిసెప్షన్ కు రాష్ట్రపతిని ఆహ్వానించారు. ఈ విషయాన్ని అధికారికంగా రాష్ట్రపతి భవన్ ట్విట్టర్ వేదికగా వెల్లడించింది.
భారత దేశం జాతీయ సంతాప దినాన్ని ప్రకటించింది గౌరవ సూచకంగా క్వీన్ ఎలిజబెత్(Queen Elizabeth II) కోసం. సెప్టెంబర్ 12న విదేశాంగ శాఖ మంత్రి సుబ్రమణ్యం జై శంకర్ న్యూ ఢిల్లీలోని బ్రిటిషన్ హై కమిషన్ ను సందర్శించారు.
దేశానికి సంబంధించి సంతాపాన్ని తెలియ చేశారు. క్వీన్ ఎలిజబెత్ -2 తన 70 ఏళ్ల పాలనలో భారత దేశంతో సత్ సంబంధాలను కొనసాగించారని ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు.
ఆమె హయాంలో యుకె – భారత్ మధ్య ఎన్నో అంశాలపై ఒప్పందాలు కూడా జరిగాయని తెలిపారు జై శంకర్. కామన్వెల్త్ అధినేతగా ప్రపంచ వ్యాప్తంగా మిలియన్ల మంది ప్రజల మనసు దోచుకున్నారని పేర్కొన్నారు.
Also Read : మహిళా కోటా బిల్లుపై కేంద్రం వివక్ష – పవార్