President Guard Of Honour : గౌర‌వ వంద‌నం రాష్ట్ర‌ప‌తి స్వీకారం

ప్ర‌మాణ స్వీకారం అనంత‌రం వేడుక‌

President Guard Of Honour : భార‌త దేశ స‌ర్వోన్న‌త రాష్ట్ర‌ప‌తి ప‌ద‌విని అలంక‌రించారు ఒడిశాకు చెందిన ద్రౌప‌ది ముర్ము. ఈ దేశానికి ఆమె 15వ రాష్ట్ర‌ప‌తి. సోమ‌వారం సుప్రీంకోర్టు ప్ర‌ధాన న్యాయ‌మూర్తి నూత‌ల‌పాటి వెంక‌ట ర‌మ‌ణ ద్రౌప‌ది ముర్ముతో రాష్ట్ర‌ప‌తిగా ప్ర‌మాణ స్వీకారం చేయించారు.

ఈ కార్య‌క్ర‌మానికి మాజీ రాష్ట్ర‌ప‌తి రామ్ నాథ్ కోవింద్ , ఉప రాష్ట్ర‌ప‌తి వెంక‌య్య నాయుడు, దేశ ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీ, లోక్ స‌భ స్పీక‌ర్ ఓం బిర్ల‌, కేంద్ర మంత్రులు, వివిధ రాష్ట్రాల‌కు చెందిన గ‌వ‌ర్న‌ర్లు, లెఫ్టినెంట్ గ‌వ‌ర్న‌ర్లు, ఎంపీలు హాజ‌ర‌య్యారు.

ఈ కార్య‌క్ర‌మానికి కాంగ్రెస్ పార్టీ చీఫ్ సోనియా గాంధీ కూడా హాజ‌ర‌య్యారు. ఇదిలా ఉండ‌గా భార‌త దేశంలో రాష్ట్ర‌ప‌తి ప‌ద‌విని అధీష్టించిన తొలి గిరిజ‌న మ‌హిళ కావ‌డం విశేషం.

గ‌తంలో ప్ర‌తిభా పాటిల్ రాష్ట్ర‌ప‌తిగా ఉన్నారు. రాష్ట్ర‌ప‌తిగా ప‌ద‌వీ ప్ర‌మాణ స్వీకారం చేసిన వెంట‌నే త్రివిధ ద‌ళాల నుంచి ద్రౌప‌ది ముర్ము గౌర‌వ వంద‌నం(President Guard Of Honour) స్వీక‌రించారు.

అంత‌కు ముందు జాతిపిత మ‌హాత్మా గాంధికి నివాళులు అర్పించారు. ప‌ద‌వీ విర‌మ‌ణ చేసిన రామ్ నాథ్ కోవింద్ కూడా ఆమె వెంట వ‌చ్చారు. రాష్ట్ర‌ప‌తి భ‌వ‌న్ ముందు భాగంలో కొత్త రాష్ట్ర‌ప‌తికి ఇంట‌ర్ స‌ర్వీసెస్ గార్డ్ ఆఫ్ హాన‌ర్ (గౌర‌వ వంద‌నం) ను ఏర్పాటు చేశారు.

ఇక ద్రౌప‌ది ముర్ముది పేద ఆదివాసీ కుటుంబం. జూనియ‌ర్ అసిస్టెంట్ గా ప‌ని చేశారు. కౌన్సిల‌ర్ గా ఎన్నిక‌య్యారు. రెండు సార్లు మంత్రిగా ప‌నిచేశారు. 2015లో జార్ఖండ్ గ‌వ‌ర్న‌ర్ గా నిర్వ‌హించారు. ప్ర‌స్తుతం రాష్ట్ర‌ప‌తిగా ఎన్నిక‌య్యారు.

Also Read : రాష్ట్ర‌ప‌తి అయినా మేడం మాకు టీచ‌రే

Leave A Reply

Your Email Id will not be published!