President Murmu : కింగ్ చార్లెస్ ను కలుసుకున్న ప్రెసిడెంట్
క్వీన్ ఎలిజబెత్ -2 అంత్యక్రియలకు హాజరు
President Murmu : బ్రిటన్ క్వీన్ ఎలిజబెత్ -2 అంత్యక్రియలు ఇవాళ జరగనున్నాయి బ్రిటన్ లో. భారత దేశం తరపున ఆమెకు నివాళులు అర్పించేందుకు గాను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము(President Murmu) మూడు రోజుల పర్యటనలో ఉన్నారు.
ఆమె ఇప్పటికే లండన్ కు చేరుకున్నారు. అక్కడి భారత దేశ రాయబార కార్యాలయం ఉన్నతాధికారులు సాదర స్వాగతం పలికారు. క్వీన్ కు తుది వీడ్కోలు పలికేందుకు బ్రిటన్ ప్రభుత్వం నుంచి ఆహ్వానం అందుకున్న దేశాలలో భారత్ కూడా ఉంది.
70 ఏళ్ల పాటు యుకె దేశానికి రాణిగా ఉన్నారు క్వీన్ ఎలిజబెత్. ఆమె 96 ఏళ్ల వయస్సులో కన్ను మూశారు. ప్రపంచంలోని పలు దేశాలకు సంబంధించిన దేశాధ్యక్షులు, ప్రధానమంత్రులు, ఉన్నతాధికారులు హాజరయ్యారు.
ఇంకా వస్తూనే ఉన్నారు లండన్ కు. భారీ ఎత్తున ఏర్పాట్లు చేశారు. ఏకంగా ఏర్పాట్లను పర్యవేక్షించేందుకు ప్రపంచానికి చెందిన 2,000 మంది అధికారులను నియమించింది బ్రిటన్.
భారీ ఎత్తున సెక్యూరిటీని కల్పించారు. ఇక క్వీన్ అంత్యక్రియలకు హాజరైన భారత దేశ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఇవాళ కింగ్ చార్లెస్ ను కలుసుకున్నారు.
ఈ సందర్భంగా తన ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు. ఆమె రావడాన్ని స్వాగతించారు హృదయ పూర్వకంగా. అంతకు ముందు బకింగ్ హామ్ ప్యాలస్ సమీపంలోని లాంకాస్టర్ హౌస్ లో క్వీన్ ఎలిజబెత్ -2 కోసం సంతాప పుస్తకంపై సంతకం చేశారు ద్రౌపది ముర్ము(President Murmu).
ఈ సందర్భంగా వెస్ట్ మినిస్టర్ హాల్ లో క్వీన్ ఎలిజబెత్ -2కి కూడా రాష్ట్రపతి నివాళులు అర్పించారు. భారత రాష్ట్రపతి వెంట విదేశాంగ కార్యదర్శి వినయ్ క్వాత్రాతో పాటు ఇతర ఉన్నతాధికారులు ఉన్నారు.
Also Read : క్వీన్ -2 కోసం తరలి వచ్చిన నేతలు