Presidential Polls : సీఎం స‌హ‌కారం ద్రౌప‌ది ముర్ము భావోద్వేగం

న‌వీన్ ప‌ట్నాయ‌క్ ను క‌లిసిన రాష్ట్రప‌తి అభ్య‌ర్థి

Presidential Polls : భార‌తీయ జ‌న‌తా పార్టీ సంకీర్ణ ప్ర‌భుత్వం ఉమ్మ‌డి రాష్ట్ర అభ్య‌ర్థిగా(Presidential Polls) బ‌రిలో నిలిచిన ద్రౌప‌ది ముర్ము శుక్ర‌వారం భావోద్వేగానికి లోన‌య్యారు. శుక్ర‌వారం ఆమె ఒడిశాలో ప‌ర్య‌టించారు.

ద్రౌప‌ది ముర్ముకు ఘ‌న స్వాగ‌తం ప‌లికారు. సీఎం ఆమెకు సాద‌ర స్వాగ‌తం ప‌లికారు. ద్రౌప‌ది స్వంత స్థ‌లం కూడా ఒడిశా రాష్ట్రం. ఆమెకు సీఎం మ‌ధ్యాహ్న భోజ‌నం ఏర్పాటు చేశారు.

సీఎం న‌వీన్ ప‌ట్నాయ‌క్ ద్రౌప‌ది ముర్మును ఎంపిక చేసినందుకు ముందుగా ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీకి ధ‌న్య‌వాదాలు తెలిపారు. ఆయ‌నే మొద‌ట‌గా ఆమెకు మ‌ద్ద‌తు ప్ర‌క‌టిస్తున్న‌ట్లు వెల్ల‌డించారు.

త‌న‌ను సోద‌రిగా భావించి త‌న‌కు మ‌ద్ద‌తు తెలిపినందుకు ధ‌న్యవాదాలు తెలిపారు ద్రౌప‌ది ముర్ము. కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. రాఖీ వాగ్ధానాన్ని నిల‌బెట్టుకున్నారంటూ ప్ర‌శంసించారు.

ఒడిశా రాష్ట్రంలోని ఎమ్మెల్యేలంతా త‌న అన్న‌ద‌మ్ముల‌ని పేర్కొన్నారు ఆమె. అత్యంత పేదరికాన్ని అనుభవించారు ద్రౌప‌ది ముర్ము. జూనియ‌ర్ అసిస్టెంట్ గా పని చేశారు.

కౌన్సిల‌ర్ గా ఎన్నిక‌య్యారు. అక్క‌డి నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. రెండుసార్లు మంత్రి గా ప‌ని చేశారు. భార‌తీయ జ‌నతా పార్టీకి జాతీయ స్థాయిలో నాయ‌కురాలిగా ఉన్నారు.

అనంత‌రం జార్ఖండ్ కు గ‌వ‌ర్న‌ర్ గా బాధ్య‌త‌లు చేప‌ట్టారు. ప్ర‌స్తుతం రాష్ట్ర‌ప‌తి అభ్య‌ర్థి రేసులో నిలిచారు. త‌న స్వంత రాష్ట్రంలో అపూర్వ‌మైన స్వాగ‌తం ప‌ల‌కడం ప‌ట్ల సంతోషం వ్య‌క్తం చేశారు ద్రౌప‌ది ముర్ము.

మ‌యూర్ భంజ్ జిల్లాకు చెందిన వారు కావ‌డంతో ఆ జిల్లా వాసులు ఆనందం వ్య‌క్తం చేస్తున్నారు. ఈ సంద‌ర్భంగా రాష్ట్ర అతిథిగా ఆమెను స్వాగ‌తం ఇస్తామ‌ని ఇప్ప‌టికే ప్ర‌క‌టించారు ఒడిశా సీఎం న‌వీన్ ప‌ట్నాయ‌క్.

Also Read : దేశ ఆర్థిక రంగానికి మ‌రాఠా చోద‌క శక్తి

Leave A Reply

Your Email Id will not be published!