Modi Rahul Top : ఆదరణలో మోదీ టాప్ రాహుల్ సూపర్
జాతీయ స్థాయి ఛానెల్ సర్వే వెల్లడి
Modi Rahul Top : ప్రజాదరణలో ఎవరికి జనాదరణ లభిస్తుందనే దానిపై జాతీయ స్థాయిలో పేరు పొందిన ఎన్డీటీవీ సర్వే చేపట్టింది. ఊహించని రీతిలో ఏఐసీసీ మాజీ చీఫ్, వాయనాడు ఎంపీగా అనర్హత వేటు పడిన రాహుల్ గాంధీకి(Rahul Gandhi) ఆదరణ పెరగడం విస్తు పోయేలా చేసింది. దీనికి ప్రధాన కారణం ఏమిటంటే ఆయన చేపట్టిన భారత్ జోడో యాత్ర. అయితే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ(Narendra Modi) ఇప్పటికీ సుప్రీంగా ఉన్నారు. 26 శాతం మంది ప్రజలు రాహుల్ గాంధీని ఎప్పుడూ ఇష్ట పడతారని , 15 శాతం మంది కాంగ్రెస్ మెగా ఔట్ రీచ్ ప్రోగ్రామ్ మరింత ఇష్ట పడేలా చేసిందని పేర్కొన్నారు.
భాతర్ జోడో యాత్ర తర్వాత రాహుల్ గాంధీ ఆమోదం రేటింగ్ కొంత మేర పెరగడం విశేషం. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి ఉన్న జనాదరణ అస్పష్టంగానే ఉందని లోక్ నీతి – సెంటర్ ఫర్ ది స్టడీ ఆఫ్ డెవలపింగ్ సొసైటీస్ (సీఎస్డీఎస్) భాగస్వామ్యంతో ఎన్డీటీవీ ప్రత్యేక సర్వేలో తేలింది. 19 రాష్ట్రాలలో 7,000 మందికి పైగా ప్రజలపై జరిపిన సర్వేలో తన ప్రభుత్వం తొమ్మిదేళ్లు పూర్తి చేసుకున్న సందర్బంగా పీఎం వక్తృత్వ నైపుణ్యం , అభివృద్ది పని , ఆకర్షణ 40 శాతం మంది ప్రజలను ఆకట్టుకుంటోంది.
25 శాతం మంది వాక్చాతుర్యాన్ని ఇష్ట పడతారని, 20 శాతం మంది అభివృద్ది పనులను ఇష్ట పడతారని , 13 శాతం మంది కృషి, చరిష్మా పట్ల ఇష్ట పడుతున్నారని తెలిపారు. మోదీ విధానాలకు 11 శాతం మంది ఆమోదం లభించడం విశేషం. ఇప్పటికిప్పుడు లోక్ సభ ఎన్నికలు జరిగిఏ 43 శాతం మోదీ పీఎం అవుతారని , 27 శాతం మంది గాంధీకి అనుకూలంగా స్పందించారు. పీఎం రేసులో కేజ్రీవాల్ కు 11 శాతం ఓట్లు వచ్చాయి. మమతా బెనర్జీకి 4 శాతం, యూపీ మాజీ సీఎం అఖిలేష్ కు 5 శాతం మాత్రమే ఓటు వేశారు.
Also Read : KTR