S Jai Shankar : రాజకీయ పరపతికి ప్రయారిటీ పెరిగింది
కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి ఎస్ జైశంకర్
S Jai Shankar : కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి సుబ్రమణ్యం జై శంకర్(S Jai Shankar) సంచలన వ్యాఖ్యలు చేశారు. ఉక్రెయిన్ వివాదం ఇవాళ ప్రపంచాన్ని ఇబ్బంది పెడుతోందన్నారు. దీని కారణంగా రాజకీయ పరపతి పరిధిని మరింత విస్తృతం చేసిందని అభప్రాయం వ్యక్తం చేశారు. ప్రపంచం వ్యూహాత్మక ధోరణిని అవలంభిస్తోందన్నారు.
కోల్ కతాలో ఆయన మీడియాతో మాట్లాడారు. పలు ప్రశ్నలకు సమాధానం చెప్పారు. రష్యా, ఉక్రెయిన్ యుద్దంలో భారత దేశం తటస్థ వైఖరిని అవలంభిస్తోందని తెలిపారు. వాణిజ్యం, అప్పులు, పర్యాటకాన్ని ఆయుధాలుగా మార్చడం అన్నది ఇవాళ కీలకంగా మారిందన్నారు జై శంకర్.
ప్రపంచీకరణకు సంబంధించి రాజకీయ సమీకరణలు పూర్తిగా మారి పోయాయని స్పష్టం చేశారు. ఇందులో ఎలాంటి ఆశ్చర్య పోవాల్సిన పని లేదన్నారు. గతంలో ఆయుధాలను బూచిగా చూపించి భయాందోళనకు గురి చేసే వారని కానీ ఇప్పుడు ఆ సీన్ లేదన్నారు. టెక్నాలజీ మారుతోంది,
రాజకీయంగా సమీకరణలు మారుతున్నాయి. ఎవరి ప్రయోజనాలు వారికి ఉన్నాయి. ఈ తరుణంలో ప్రతి దేశం ఇంకో దేశంతో ఆధారపడి ఉన్నదే. ఏ ఒక్క దేశం స్వయం సమృద్దిని సాధించలేని పరిస్థితి నెలకొందన్నారు. కానీ భారత్ ఎప్పుడూ యుద్దాన్ని కోరుకోదని శాంతిని మాత్రమే ఆశిస్తుందన్నారు సుబ్రమణ్యం జై శంకర్(S Jai Shankar) .
గ్లోబలైజేషన్ వల్ల కొంత అన్యాయం జరిగింది ఈ ప్రపంచానికి. ఇదే సమయంలో కరోనా పూర్తిగా కోలుకోలేని దెబ్బ కొట్టిందన్నారు . ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్ మెంట్ లో కీలక ప్రసంగం చేశారు కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి.
Also Read : నా లక్ష్యం అవినీతి రహిత భారతం – మోదీ