Priya Ponguru : తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి నారాయణపై సంచలన ఆరోపణలు చేశారు ఆయన తమ్ముడి భార్య ప్రియ పొంగూరు. ఇన్ స్టా గ్రామ్ వేదికగా స్వయంగా వీడియోను షేర్ చేశారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీనిపై ఇంకా స్పందించ లేదు మాజీ మంత్రి.
Priya Ponguru Comments
తనను వేధింపులకు గురి చేస్తున్నాడని, లైంగికంగా హింసిస్తున్నాడంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఓ గద్దలా తనపై కన్నేశాడని, తనను వెంటాడుతున్నాడంటూ వాపోయారు. తన పెళ్లి అయినప్పటి నుంచి నేటి వరకు ప్రతి నిత్యం నరకం అనుభవించానని కన్నీటి పర్యంతం అయ్యారు ప్రియా పొంగూరు(Priya Ponguru).
తన భర్త ఇంట్లో లేని సమయంలో అర్ధరాత్రి పూట డిస్ట్రబ్ చేస్తున్నాడంటూ ధ్వజమెత్తారు. తాను వినక పోవడంతో తన కుటుంబాన్ని కూడా నానా రకాలుగా ఇబ్బందులకుగ ఉరి చేశాడు నారాయణ అంటూ ఆరోపించారు.
నారాయణ మామూలోడు కాదని, ఆయనకు రెండు పెళ్లిళ్లు అయ్యాయని తెలిపారు. అయితే రెండో భార్య గురించి ఆధారాలు లేవన్నారు ప్రియా పొంగూరు. ఇదిలా ఉండగా నారాయణ తమ్ముడు మణి, ప్రియా పొంగూరు ప్రస్తుతం హైదరాబాద్ లో ఉన్నట్లు సమాచారం. ఇప్పటికే నారాయణపై పలు కేసులు నమోదయ్యాయి. తాజాగా ప్రియా చేసిన ఆరోపణలు కలకలం రేపుతున్నాయి.
Also Read : Godavari Flood Bhadrachalam : భద్రాచలానికి పోటెత్తిన వరద 3వ ప్రమాద హెచ్చరిక