Priyank Kharge : సీఎం పదవి ఇస్తానంటే ఓకే
ఐటీ, హోం శాఖ మంత్రి ప్రియాంక్ ఖర్గే
Priyank Kharge : కర్ణాటక – రాష్ట్రంలో కొలువు తీరిన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో రోజు రోజుకు అసంతృప్తి కొనసాగుతోంది. ఒకరిపై మరొకరు ఆరోపణలు చేసుకుంటూ రక్తి కట్టిస్తున్నారు. ఆచరణకు నోచుకోని హామీలు ఇచ్చి , ప్రజలను మభ్య పెట్టి అధికారంలోకి వచ్చింది కాంగ్రెస్ పార్టీ.
Priyank Kharge Comments Viral
సీఎం కుర్చీ కోసం భారీ ఎత్తున ఆధిపత్య పోరు కొనసాగింది. చివరకు పార్టీ హైకమాండ్ మల్లగుల్లాలు పడి ఎట్టకేలకు పదవిని రెండున్నర ఏళ్లకు ఒకరు చొప్పున పంచారు. తొలుత సీనియర్ నాయకుడు, ఎలాంటి వివాదాలు లేని సిద్దరామయ్యకు ముఖ్యమంత్రి పదవి అవకాశం ఇచ్చారు.
ఇక పార్టీకి పూర్వ వైభవాన్ని తీసుకు రావడమే కాకుండా, పార్టీలో ట్రబుల్ షూటర్ గా పేరు పొందిన డీకే శివకుమార్ కు డిప్యూటీ సీఎం పదవి కట్టబెట్టారు. తీరా ఇప్పుడు మరొకరు రంగంలోకి దిగారు. ఆయన ఎవరో కాదు ప్రస్తుతం కేబినెట్ లో కొలువు తీరిన ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే తనయుడు ఐటీ, హోం శాఖ మంత్రి ప్రియాంక్ ఖర్గే(Priyank Kharge).
ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పార్టీ హైకమాండ్ గనుక ఆదేశిస్తే తాను ముఖ్యమంత్రి పదవి చేపట్టేందుకు రెడీగా ఉన్నాననంటూ బోల్డ్ కామెంట్ చేశాడు. ప్రస్తుతం ఆయన చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి.
Also Read : Mohammad Shami : కష్టాలే వికెట్లు తీసేలా చేశాయి