Priyanka Chaturvedi : ప్రశ్నించడమే నేరమా – ప్రియాంక
ఎంపీ సంజయ్ సింగ్ కు మద్దతు
Priyanka Chaturvedi : మోదీ పాలనలో ప్రశ్నించడమే నేరంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు శివసేన యుబిటీ ఎంపీ ప్రియాంక చతుర్వేది(Priyanka Chaturvedi). ఆమె మీడియాతో మాట్లాడారు. మణిపూర్ లో చోటు చేసుకున్న ఘటనలపై వివరణ ఇవ్వాలని కోరడం తప్పు ఎలా అవుతుందని ప్రశ్నించారు. రాజ్యసభలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జవాబు చెప్పాలని అడగడాన్ని కేంద్రంలోని బీజేపీ సర్కార్ జీర్ణించు కోలేక పోతోందని మండిపడ్డారు.
Priyanka Chaturvedi Feels
ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ ను సస్పెండ్ ఎలా చేస్తారంటూ నిప్పులు చెరిగారు. ఇదంతా కావాలని చేస్తున్న ప్రయత్నంగా ఆమె అభివర్ణించారు. వెంటనే రాజ్యసభ చైర్మన్ ఆయనపై సస్పెన్షన్ తొలగించాలని ప్రియాంక చతుర్వేది డిమాండ్ చేశారు. ఇది మంచి పద్దతి కాదన్నారు. ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరికీ మాట్లాడే హక్కు ఉంటుందని, ఆ విషయం బీజేపీ నేతలు తెలుసు కోవాలన్నారు.
నిత్యం దేశం పేరు చెప్పి విదేశాలలో పర్యటిస్తున్న ప్రధాని మోదీకి కనీసం మణిపూర్ లో చోటు చేసుకున్న దారుణాలు తెలియకుండా ఉంటాయని తాను అనుకోవడం లేదన్నారు. ఇప్పటి వరకు అక్కడ సాధారణ పరిస్థితులు చోటు చేసుకోలేదని దీనికి పూర్తి బాధ్యత మోదీ తీసుకోవాలని స్పష్టం చేశారు ఎంపీ. దేశంలో ప్రజాస్వామ్యానికి ముప్పు ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు ప్రియాంక చతుదర్వేది.
Also Read : RS Praveen Kumar : బీఆర్ఎస్ సర్కార్ అవినీతికి కేరాఫ్