Priyanka Chaturvedi : స్మతీ ఇరానీపై ప్రియాంక సెటైర్
నన్ను కూడా వండనీయండి
Priyanka Chaturvedi : శివసేన ఎంపీ ప్రియాంక చతుర్వేది నిప్పులు చెరిగారు కేంద్ర మంత్రి స్మృతీ ఇరానీపై(Smriti Irani). ఓ వైపు దేశంలో బీజేపీ శ్రేణులు దాడులకు, హత్యలకు,, అత్యాచారాలకు పాల్పడుతుంటే కేంద్ర మంత్రి తాను చేస్తున్న వంట పేరు ఏమిటో చెప్పండి అంటూ నెట్టింట్లో నెటిజన్లను అడగడాన్ని తీవ్రంగా తప్పు పట్టారు శివసేన ఎంపీ.
స్మృతీ ఇరానీ బాధ్యతా రాహిత్యాన్ని సూచిస్తోందంటూ నిప్పులు చెరిగారు. ఇరానీ తన ఇన్ స్టా గ్రామ్ లో చేసిన పోస్ట్ పై తీవ్రంగా స్పందించారు ప్రియాంక చతుర్వేది(Priyanka Chaturvedi) .
ఉత్తరాఖండ్ లో భారతీయ జనతా పార్టీ నాయకుడు, మాజీ మంత్రి కుమారుడు 19 ఏళ్ల మహిళను హత్య చేసిన ఘటనపై మాట్లాడక పోవడాన్ని తప్పు పట్టారు.
ఒక మహిళా మంత్రిగా ఉంటూ సాటి మహిళను తన పార్టీకి చెందిన నాయకుడు తనయుడు చేసిన నిర్వాకాన్ని ఖండించక పోవడం దారుణమన్నారు ఎంపీ. మహిళా, శిశు అభివృద్ది శాఖ మంత్రి వంట అంటే ఏమిటి అంటూ క్యాప్షన్ తో పోస్ట్ చేయడం తనను నవ్వు తెప్పించిందని పేర్కొన్నారు.
కేంద్రంలో కొలువు తీరిన మోదీ ప్రభుత్వం(PM Modi Govt) మొత్తం ఇదే ఉదాసీన వైఖరిని ప్రదర్శిస్తోందని ధ్వజమెత్తారు ప్రియాంక చతుర్వేది. యువతి వ్యభిచారంలోకి నెట్టే ప్రయత్నాలను ప్రతిఘటించింది.
దీనిని తట్టుకోలేక బీజేపీ మాజీ మంత్రి కుమారుడు తన ప్రాణాలను హరించి వేశాడని ఇదేనా మహిళలకు రక్షణ అని ప్రశ్నించింది. ట్విట్టర్ వేదికగా ప్రియాంక చతుర్వేది సీరియస్ అయ్యింది.
ఇప్పటికే ఇరానీకి చెందిన సిల్లీ సోల్ కేఫ్ అండ్ బార్ యాజమాన్యం చుట్టూ వివాదం నడుస్తోంది. దీనిని కూడా ప్రత్యేకంగా ప్రస్తావించారు.
Also Read : లైంగిక వేధింపులపై సీబీఐ దాడులు