Priyanka Chaturvedi : ముందు మీ వారిని నిలదీయండి
శివసేన ఎంపీ ప్రియాంక చతుర్వేది
Priyanka Chaturvedi : కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ తనను ఉద్దేశించి ఫ్లైయింగ్ కిస్ ఇచ్చారంటూ సంచలన ఆరోపణలు చేశారు కేంద్ర మంత్రి స్మృతీ ఇరానీ. దీనిపై పెద్ద ఎత్తున చర్చ జరిగింది. చివరకు పార్లమెంట్ లో విచారణకు ఆదేశించే దాకా తీసుకు వెళ్లింది. మణిపూర్ పై చర్చ సందర్భంగా రాహుల్ గాంధీ మాట్లాడారు. ఆయన సభను విడిచి వెళుతున్న సమయంలో ఫ్లయింగ్ కిస్ ఇచ్చారంటూ ఇరానీ వాపోయారు. ఇలాంటి వ్యక్తి ఎంపీ కావడం దారుణమన్నారు.
Priyanka Chaturvedi Comments
కేంద్ర మంత్రి స్మృతీ ఇరానీ ఆరోపించడాన్ని తీవ్రంగా తప్పు పట్టారు శివసేన ఎంపీ ప్రియాంక చతుర్వేది(Priyanka Chaturvedi). ఒకరిపై ఆరోపణలు చేసే ముందు తమ భారతీయ జనతా పార్టీలో ఎంత మంది సచ్చీలురు ఉన్నారో చూడాలన్నారు. రేపిస్టులు, లైంగిక వేధింపులకు పాల్పడే వారు ఎంపీలు, ఎమ్మెల్యేలు కావడం రాజకీయ ఒత్తిళ్లతో మౌనంగా ఉంటున్న మీ లాంటి మహిళలు పునరాలోచించు కోవాలని స్పష్టం చేశారు ప్రియాంక చతుర్వేది.
బీజేపీకి చెందిన ఎంపీ , డబ్ల్యూఎఫ్ఐ చీఫ్ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ పై మహిళా మల్ల యోధులు బహిరంగంగా లైంగిక వేధింపులకు పాల్పడుతున్నాడంటూ రోడ్డెక్కినా, కన్నీళ్లు కార్చినా పట్టించు కోలేదని ఇప్పుడు ఎందుకు నోరు పారేసుకుంటున్నారంటూ ఇరానీపై భగ్గుమన్నారు శివసేన ఎంపీ.
Also Read : DK Shiva Kumar : డీకేపై కామెంట్స్ కలకలం