Priyanka Gandhi : అధ్యక్ష పదవి ఎన్నికపై ప్రియాంక ఫోకస్
అక్టోబర్ 17న చీఫ్ ఎన్నికకు పోలింగ్
Priyanka Gandhi : గాంధీ ఫ్యామిలీ పోటీ చేయక పోయినా కాంగ్రెస పార్టీ అధ్యక్ష పదవి ఎన్నికల్లో వారి ప్రభావం తప్పక ఉండనుంది. ఇప్పటికే తాను పోటీలో లేనంటూ ప్రకటించారు రాహుల్ గాంధీ. తాను భారత్ జోడో పాదయాత్రలో బిజీగా ఉన్నారు.
మరో వైపు రోజు రోజుకు కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి పార్టీ పరంగా. నిన్నటి దాకా రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్ పోటీ చేస్తారని భావించారంతా. కానీ ఉన్నట్టుండి తెర మీదకు కొత్త పేర్లు వచ్చాయి. ఒకరు మాజీ సీఎం దిగ్విజయ్ సింగ్ కాగా మరొకరు మల్లికార్జున్ ఖర్గే.
ఎవరు పార్టీ అధ్యక్షుడిగా గెలిచినా మొత్తం నడిచేదంతా సోనియా గాంధీ పేరు మీదేనని చెప్పక తప్పదు. మరో వైపు గాంధీ ఫ్యామిలీ నుంచి ఇప్పటికే అభ్యర్థులు ఖరారు కాగా నాన్ గాంధీ ఫ్యామిలీ నుంచి కేవలం ఒకే ఒక్క పేరు ప్రముఖంగా వినిపిస్తూ వస్తోంది.
జి23 అసమ్మతి వర్గంలో కీలకంగా ఉన్న తిరువనంతపురం ఎంపీ శశి థరూర్ బరిలో ఉండనున్నారు. ఇప్పటికే ఆయన ఈ విషయాన్ని ప్రకటించారు కూడా. శుక్రవారం నామినేషన్లు దాఖలు చేసేందుకు ఆఖరు.
కాగా 20 ఏళ్ల తర్వాత గాంధీ కుటుంబం నుంచి ఎవరూ పోటీలో లేని కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల్లో కొత్త అధ్యక్షుడిని ఎన్నుకోవడం ఇదే తొలిసారి. కానీ స్పష్టంగా ఇప్పటి వరకు అధికారం చేతులు మారలేదు.
మరో వైపు పార్టీలోని అత్యధిక నాయకులు, కార్యకర్తలు ప్రియాంకా గాంధీని(Priyanka Gandhi) ప్రెసిడెంట్ కావాలని కోరుతున్నారు. ప్రజాభిప్రాయానికి విరుద్దంగా ఆమె ఎన్నికలపై ప్రభావం చూపిస్తున్నారనే ఆరోపణలు కూడా ఉన్నాయి. ఏది ఏమైనా ఎవరు గెలిచినా పార్టీ చీఫ్ గా గాంధీ ఫ్యామిలీని కాదని పార్టీని నడపడం చాలా కష్టం.
Also Read : రాజస్థాన్ సంక్షోభం టీ కప్పులో తుపాను